డైలాగ్ కింగ్‌లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటన ఓ కళ. అరవై నాలుగు కళల్లో చాలా గొప్పది నటన. నటించడం కాదు జీవించాలి. ఒక్కోసారి కొంతమంది నటులు ఒక్కో సీన్లో నటించడం కాదు జీవిస్తారు. ఆ పాత్రకు జీవం పోస్తారు. నటిస్తున్నారన్న భావననే కలగదు కొందరికి. అంత చక్కగా నటిస్తారు. నిజ జీవితంలో మాదిరిగానే రియాలిటీ అనిపిస్తుంది. అలాంటి నటులను, అలాంటివారు నటించిన పాత్రలను ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోరు. నటనతోపాటు డైలాగులు చెప్పడంలో దిట్ట కొంతమంది నటీనటులు. మాటలను తగ్గట్లు వారి ముఖంలో హావభావాలు కనిపిస్తాయి. అంతటి నైపుణ్యాన్ని ప్రదర్శించేవారున్నారు తెలుగు చిత్రపరిశ్రమలో. అలనాటి చిత్రాల్లో నుంచి గనుక తీసుకున్నట్లయితే మొదటిస్థానంలో నిలిచేది కీ.శే. మహానటులు రావుగోపాలరావు. ఎక్కువగా విలన్‌పాత్రల్లో నటించి ప్రేక్షకుల మదిని దోచిన నటుడాయన. తెరపై రావుగోపాలరావు కనిపిస్తే ప్రేక్షకుల ముఖాల్లో కాంతులు విరజిమ్మేవి. డైలాగులు చెప్పటంలో ఆయనకు ఆయనేసాటి. ఇక ఆయనకుతోడు కీ.శే. అల్లు రామలింగయ్య తోడయ్యారంటే ఆ సన్నివేశం తెరమీద కనబడుతున్నంత వరకు నవ్వులేనవ్వులు. పొట్ట చెక్కలయ్యేలా హాస్య సన్నివేశాలుంటాయి. ఆ కోవలోకే చెందినవారు రాజబాబు, చిట్టిబాబు, పద్మనాభం, జగ్గయ్య, కాంతారావు, ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఎన్నార్, మోహన్‌బాబు.
కమల్‌హాసన్ అయితే అబ్బ ఎన్ని పాత్రలనయినా ఒకే సినిమాలో నటిస్తూ, ఆ పాత్రలన్నింటికీ జీవం పోయగల వ్యక్తి. కమల్‌హాసన్ విచిత్రసోదరులు సినిమాలో మరుగుజ్జు వ్యక్తిగా మహా బాగా నటించాడు. డైలాగులు చెప్పడంలో గొప్ప ప్రావీణ్యం కలిగినవాడు కమల్‌హాసన్. కమల్‌హాసన్ ఆకలిరాజ్యం సినిమాలో హీరోయిన్ కమల్ ఉండే అద్దె ఇంటికి వచ్చినపుడు వారి స్నేహితులు, అతను బాగా ఆకలితో ఉంటారు. ఆ ఆకలిని హీరోయిన్‌కి తెలియనీయకుండా దాచేందుకు భోజనం చేస్తున్నట్లు నటించిన సీన్ అదరహో! వారి ఆకలిని చూసి, వారికి తినడానికి తిండి లేక పడుతున్న పాట్లను చూసి హీరోయిన్ ఏడ్చే సందర్భాన్ని చూసిన వారికి ఎవరికైనా బాధ కలగాల్సిందేమరి. అంతటి మెసేజ్ ఉన్న సినిమా ఆకలిరాజ్యం.
ఇక మోహన్‌బాబు అయితే ఏ పాత్ర ఇచ్చినా దానిలో పరకాయ ప్రవేశం చేసేస్తారు. విలన్‌పాత్ర, హీరోపాత్ర, తండ్రిపాత్ర, ఒకప్పుడు కమెడియన్

పాత్రలు చేసినా కూడా ఆ రకమైన అన్ని పాత్రల్లో ఒదిగిపోతారు. గంభీరమైన స్వరం మోహన్‌బాబుది. రావుగోపాలరావు స్వరం
కూడా చాలా కాఠిన్యంగా, గంభీరంగా ఉండేది. అలా గాంభీర్యంగా మాట్లాడడం రావుగోపాలరావుకే చెల్లింది. వ్యం గ్యంగా మాట్లాడినా, కోపం గా మాట్లాడినా, నవ్వుతూ మాట్లాడినా కూడా క్షణాల్లో ఆ సీన్‌లోకి ఒదిగిపోయేవారు. ఆ తరువాత కొంతకాలానికి శోభన్‌బాబు కూడా కుటుంబ తరహా చిత్రాల్లో ఎక్కువగా నటించి మహిళలకు, వారి ఆదరణకు దగ్గరయ్యారు. అతని మాటలు పాత్రకు తగినట్లే ఎవరినీ నొప్పించినట్లు ఉండేవి కాదు. తర్వాత కాలంలో సాయికుమార్ నటన, డైలాగ్ డెవివరీ అద్భుతంగా సినిమాల్లో పండింది. అగ్ని చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన సాయికుమార్ నటన మహా అద్భుతం. ఒకే సీన్లో కోపం (రౌద్రం), వ్యంగ్యం అన్నీ ఉండేవి. ఆయన నటుడు రాజశేఖర్‌లాంటి వాళ్ళకు కూడా డబ్బింగ్ చెబున్నారు. రావుగోపాలరావు తర్వాత సాయికుమార్ డైలాగ్ డెలివరీ అంతటి స్థానాన్ని సంపాదించుకొంది. ఇప్పుడు మహానటులు కీ.శే. రావుగోపాలరావు అబ్బాయి రావు రమేష్ డైలాగ్‌లు చెప్పి, ప్రేక్షకుల మదిని దోచుకోవడంలో తండ్రి తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. డైలాగ్‌లు చెప్పడంలో తండ్రి నోట్లో నుండి రాలిపడ్డాడా? అనిపిస్తుంది అతన్ని చూస్తుంటే.
అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్ భార్య నదియాను ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ చేసుకుని లీగల్ ప్రాక్టీషనర్‌గా భార్య చాటు భర్తలా చాలా సైలెంట్ పాత్ర పోషించాడు. అ ఆ సినిమాలో పల్లెటూరు వాడిగా భలే ఒదిగిపోయాడు. ఇక ఈ మధ్యలో వచ్చిన అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ (డిజె)లో నిక్కర్ వేసుకుని రొయ్యలనాయుడు పాత్ర పోషించారు. రొయ్యలనాయుడు పాత్రను చూస్తుంటే ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లో ఆయన తండ్రి రావుగోపాలరావు కూడా అచ్చు అలాగే నిక్కర్‌తో కనిపించిన సన్నివేషమే ప్రేక్షకుల కళ్ళముందు కదలాడిందని చెప్పవచ్చు. ఆ పాత్ర పోషించిన రావు రమేష్ తండ్రికి తగ్గ తనయుడి అనిపించుకున్నారు. రావు రమేష్ డైలాగ్ డెలివరీలో చాలా నెమ్మది, అంతకంటే స్పష్టం గా, ఎక్కువగా వ్యంగ్యం, హాస్యం కనిపిస్తాయి. ఇప్పు డు వస్తున్న సినిమాల్లో రావు రమేష్ ఏ పాత్ర చేసినా ప్రేక్షకులను తనదైన రీతిలో మెప్పిస్తున్నాడు. తాను సినిమాలో కనిపించినట్లయితే ఆ సినిమా సగం హిట్టయినట్లే. అంత మంచినటన, డైలాగ్ డెలివరీ ఆయనకే సొంతం. సీనియర్ నటుల బాటలో రెండవ దశ డైలాగ్‌ల విషయంలో హావభావాలు పలికించడంలో గొప్ప నటునిగా రావు రమేష్ సాగిపోతున్నారు.

-శ్రీనివాస్ పర్వతాల