సబ్ ఫీచర్

పల్లెబరిలో పందెం కోళ్ళు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గామ సీమలకూ, కోడిపందాలకూ మధ్య విడదీయలేని అవినాభావ సంబంధముంది. అందుకే తెలుగు నాట కోడి పందాలు లేని సంక్రాంతి లేదంటే నమ్మండి. ఏటా ఇలాంటి కోడి పందాలతో గ్రామ సీమల్లో కక్షలు కార్పణ్యాలు పెచ్చుపెరిగి రక్తసిక్తమవుతాయని కాబోలు ‘పల్నాటి యుద్ధా’నికి కారణమైన కోడి పందాలపై రానురాను ఆంక్షలు వచ్చేశాయి. తదుపరి పందాలు, పై పందాలు, జూదాల వంటి వ్యసనాలు పెచ్చుమీరడంలో వాటిపై సాక్షాత్తూ సుప్రీంకోర్టే నిషేధం విధించినా ఎవరూ జంకడం లేదు. పైగా ‘అది మా సంస్కృతిలో భాగం. మేమెలా మానుకోగలం’ అనే వాదనొకటి వినిపించడం షరా మామూలే. పెద్దపెద్ద రాజకీయ నేతలు ఈ సంక్రాంతి సాంస్కృతిక క్రీడలను ఆసక్తిగా, అనురక్తితో తిలకించి ఆనందిస్తున్నందున వారు సైతం ‘కోడి పందాల’ను ఆపడానికి అంగీకరించడం లేదు.
తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. తెలుగు నాట ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్లి చూసినా పందెపు కోళ్ల రెక్కల చప్పుడు వినిపిస్తుంది. పందెగాళ్ల చేతుల్లో ఆప్యాయంగా ఒదిగిపోయి కమ్మని అరుపుతో అలరిస్తుంటాయి. పాపం వాటికేమి తెలుసు? బరిలోకి దిగాక తమ బతుకులు చట్టుబండలౌతాయని, పందేల బరిలోకి దిగే కోళ్లు అలాంటిలాంటివి కావు. వాటి రాజసమే వేరు. పోటీలో దిగే ముందే ‘రాజు వెడలె రవి తేజములలరగ అన్న’ట్టు ఎదురొచ్చే కోటిపై ఎత్తుకు పై ఎత్తు వేసి రంగంలోకి ఎగిరి తన్నడం ‘పందెం కోడి’ నైజం. అందుకే పందేల వేళ దిట్టంగా పెరిగిన కోళ్లు పందెగాడి కన్నా పౌరుషంగా మాటువేసి ప్రత్యర్థి కోడిని ఎగిరి తన్ని గాయపరుస్తాయి. ఈ రకం కోళ్ళను ఆరు నెలలనుంచే పెంచి పోషించి బలంగా తయారుచేయడంలో ఉండే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కో కోడిని పెంచేందుకు కనీసం లక్ష రూపాయల వరకు ఖర్చవుతాయంటారు. కోడిపుంజుల ఎంపికలో యజమానులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నెమలి, కాకి రకం పుంజులు బలిష్టంగా తెలివిగానూ ఉంటాయని ఆంధ్రాలో ప్రతీతి. జీడిపప్పు, బాదం, పిస్తాలను తినిపిస్తారు. కోడి కూత పెట్టిందంటే ఎలాంటి పౌరుషమైనా బరిలో నేలకొరగాల్సిందే.
ఈ పందాలు కూడా లక్షల్లో జరుగుతుంది. నిరుడు కనీస పందెం రూ. రెండు లక్షల వరకు సాగింది. కొన్ని ప్రాంతాలలోనైతే రూ.పది లక్షల పందెం కాసేందుకైనా తెగబడతారు. ఈ పందాలంటే తెలుగు రాష్ట్రాలలో ఏ ఔత్సాహికుడైనా చెవికోసుకుంటారు. గ్రామీణాంధ్రలో సంక్రాంతి అంటే శారీరక ఉల్లాసాన్ని అందించే కబడ్డీ వంటి ఆటల పోటీలు, మరోపక్క కోడి పందాలు, భోగి మంటలతో భోగభాగ్యాలు పండుగగా విలసిల్లుతుంది. సాధారణంగానే యువ చైతన్యం కలిగే సమయమిది. యువతలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇవన్నీ ఉంటేనే సంక్రాంతి బాగా జరుపుతున్నట్లు భావిస్తారు. ఒకనాడీ వేడుకలు, ఉత్సవాలు జరుపుకునే సందర్భానికి ప్రత్యేకత ఉండేది. ఉల్లాసకర వాతావరణంలో ఇంటిల్లిపాదీ ఈ పోటీలు చూసేందుకు తరలి వచ్చేవారు. కానీ ఈనాడు అవే కోడి పందాలలో లక్షలకు లక్షల రూపాయలు బెట్టింగుల పేరిట చేతులు మారుతోంది. దీనిరూపం మార్చుకున్నాక కూడా ఊరంతా సందడిగా మారిపోతుంది.
ఆచారం అనాగరికం కాకుంటే ఎవరూ అడ్డు చెప్పబోరు. కానీ పక్షి జీవాలు హింసకు గురవుతూంటే చూస్తూ పందాలు కాసుకోవడమంటే అది ‘మృగయా వినోదం’ కాక మరేమిటి? అందుకే సంక్రాంతి వైభవానికి ముచ్చటైన ముగింపూ అవసరమే!

-వరిగొండ కాశీ విశే్వశ్వరరావు