ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్నెట్‌తో వాయిస్‌కాల్స్ మళ్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 13: ఇంటర్నెట్ ద్వారా వాయిస్‌కాల్స్‌ను అక్రమంగా మళ్లిస్తూ అటు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడమే కాకుండా భారత ప్రభుత్వ రక్షణ వ్యవహారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ప్రధాన నిందితుడు కడపకు చెందిన హఫీజుల్లాను అరెస్టుచేసినట్లు కడప డీఎస్పీ మాసూంబాషా వెల్లడించారు. శనివారం కడపలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్‌ను అక్రమంగా మళ్లిస్తూ ఎక్సేంజ్‌లు ఏర్పాటు చేసిన హఫీజుల్లాపై కొద్దిరోజులుగా నిఘా పెట్టామన్నారు. జిల్లా యంత్రాంగంతో పాటు రాష్టస్థ్రాయి అధికారులు పూర్తిస్థాయి దృష్టి సారించడంతో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పరిజ్ఞానం (వీవోఐపీ) ద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశంలోని అనధికారిక ఎక్సేంజ్‌లకు సమాచారం వస్తోందన్నారు. ఇది ఇక్కడి నుంచి సాధారణ దేశీయ కాల్స్‌గా మారుతుందని , ఈకాల్స్‌ను దారి మళ్లించి అనేక విధాలుగా సొమ్ము చేసుకుంటున్నారని వెళ్లడించారు. ఇటువంటి కాల్స్ ద్వారానే మన దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం అందడంతో హఫీజుల్లాను పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని వెల్లడించారు. ఈ సమాచారం దేశంలోని అనేక ప్రాంతాల్లో అక్రమంగా వెలసిన ఎక్సేంజ్‌ల ద్వారా వివిధ దేశాలకు చేరేవేసే అవకాశం ఉందని వెల్లడించారు. హఫీజుల్లా తీరుపై కొద్దిరోజులుగా నిఘా పెట్టామన్నారు. ఆయనకు వస్తున్న కాల్స్, ఆయన నిర్వహిస్తున్న ఎక్సేంజ్ ఆఫీస్‌పై దాడిచేసి అనేక కీలక డాక్యుమెంట్లు సేకరించి చివరకు హఫీజుల్లాను అరెస్టు చేశామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, చిన్నచౌకు ఎస్‌ఐ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ