సుడిగాడు మొదలెట్టాడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 27 January 2018
అల్లరి నరేష్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సుడిగాడు సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా సుడిగాడు-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారట. సుడిగాడు సినిమా నరేష్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తరువాత నరేష్ నటించిన చిత్రాలన్నీ వరుస పరాజయాలతో టెన్షన్ పెట్టాయి. ఈ నేపథ్యంలో మళ్లీ సుడిగాడు లాంటి చిత్రాన్ని చేయడానికి నరేష్ భీమనేనితో చేస్తున్న ప్రయత్నమిది.