ఆంధ్రప్రదేశ్‌

బాబూ.. మీరు గ్రేట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 13: సాంకేతిక పరిజ్ఞానం, ముందుచూపులో మిమ్మల్ని చూసి ప్రపంచం గర్విస్తోందని సీఎం చంద్రబాబును రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభినందించారు. రాష్ట్రంలో వ్యవసాయం, విద్య, వైద్యరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. అంతకంటే ముందు మంత్రి నారా లోకేష్ స్వయంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి అంబానీకి స్వాగతం పలికి తనవెంట తీసుకువెళ్లారు. సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) సెంటర్‌ను పరిశీలించిన ముఖేష్ అంబానీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రైవేట్ సంస్థలకు పోటీగా, దీటుగా సాంకేతిక వ్యవస్థను తీసుకురావడం మొదటిసారి చూస్తున్నానని కితాబిచ్చారు. మీరు తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తీరు అప్పట్లో ప్రపంచమంతా చెప్పుకుందని, దానికి తాను కూడా ఒక సాక్షినని గుర్తుచేసుకున్నారు. అయితే విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు పెట్టుబడి పెట్టాల్సిన ప్రాధాన్యతా రంగాలని, అందులో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలని అంబానీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇన్నోవేటర్ కావాలని, క్లర్క్ ఉద్యోగాలతో సరిపెట్టుకోకుండా అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధం కావాలని, అందుకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుకోవాలని సూచించారు. సాధారణ సాఫ్ట్‌వేర్ మాదిరి కాకుండా ఓపెన్ సాఫ్ట్‌వేర్ తయారు చేయగలిగితే, భావితరాలకు ఉపయోగం ఉంటుందని సూచించారు. తన తండ్రి ధీరూభాయ్ అంబా నీ జీవించిన కాలంలో మీరు వచ్చి ఫైబర్ నెట్ గురించి రెండు గంటలసేపు ఆయను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు.. అందుకు ఆయ న అంగీకరించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేనని బాబుతో అన్నారు. ప్రపంచంలో అన్నిటికంటే డేటా ముఖ్యమైందని, అది ప్రజలకు అందించేందుకు ప్రైవేట్ కంపెనీల కంటే మిన్నగా మీరు చేస్తున్న కృషి సామాన్యమేమీ కాదని, దీన్ని భావితరాలు గుర్తుపెట్టుకుంటాయని కితాబునిచ్చారు. రిలయన్స్ ఫైబర్ నెట్‌కు మీరే స్ఫూర్తిప్రదాత అన్నారు. ఫైబర్ నెట్ ప్రాధాన్యం, దాని భవిష్యత్ గురించి 13 ఏళ్ల క్రితమే చెప్పిన మీ ఆలోచనా విధానం, దూరదృష్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమన్నారు. మీ సేవలు, అనుభవాలు ఇతర రాష్ట్రాలకు అందించాలని కోరారు. సహజంగా ప్రజలే ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తుంటారని, అయితే మీరే ప్రజలకు ఫోన్ చేసి సమస్యలు కనుగొనే ప్రో-యాక్టివ్ గవర్నమెంట్ సిస్టంను ప్రవేశపెట్టడం ఆశ్చర్యంగా ఉందని, పరిపాలనాదక్షతలో మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ వినియోగంలో మాకంటే మీరే ముందున్నారని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆర్టీజీ పనితీరు, వాటి సేవలు గురించి స్వయంగా ముఖేష్‌కు వివరించారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో మీరు ఎంత అవసరం అనుకుంటే ఎక్కడ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే అక్కడ తాను పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ముఖేష్ సంసిద్ధత వ్యక్తం చేశారు.
chitram...
ఆర్టీజీ సెంటర్‌కు పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీని వెంటబెట్టుకుని తీసుకొస్తున్న సీఎం చంద్రబాబు