ఆంధ్రప్రదేశ్‌

విభజన హామీలను నెరవేర్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు/నరసరావుపేట, ఫిబ్రవరి 17: రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తెలుగుజాతికి అన్యాయం జరిగితే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమేనన్నారు. శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కాకాని గ్రామం వద్ద జెఎన్‌టీయూకే నరసరావుపేటకు క్యాంపస్ నూతన భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన విభజన హామీలను తప్పక నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హక్కులను పద్ధతి ప్రకారం కాపాడుకోవాలని అన్నారు. రాష్ట్ర విభజనతో మనకు తీరని అన్యాయం జరిగిందని, మనల్ని చాలా రకాలుగా అవమానించారన్నారు. బస్సునే ఆఫీస్‌గా, ఇల్లుగా మార్చుకుని పనిచేశానన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆవేదన చెందారు. ఏపీకి న్యాయం చేయాలని తాను 29సార్లు ఢిల్లీ వెళ్ళి అడిగానని అన్నారు. అయినా ఇప్పటికీ న్యాయం చేయలేదన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, ఐదుకోట్ల మంది ప్రజల తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. సరైన న్యాయం జరిగేవరకు అందరి సహకారంతో కేంద్రంపై వత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. తన జీవితంలో ఎప్పుడూ రాజీ పడలేదన్నారు. తనకు వ్యక్తిగత అజెండాలేదని, భావితరాల కోసం ప్రజలు ఏకతాటిపై ఉండి, కేంద్రంపై వత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పినవి అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. విభజన సమయంలో ఆస్తులు, అప్పులు పద్ధతి ప్రకారం విభజించలేదన్నారు. విభజన జరిగి మూడున్నరేళ్లు గడిచినా రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవటం లేదన్నారు. విభజన హేతుబద్ధంగా చేస్తే ఇంత ఇబ్బంది పడేవాళ్ళం కాదన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ఇప్పటికీ సరైన న్యాయం జరగలేదన్నారు. చివరి బడ్జెట్‌లోనూ అన్యాయం జరిగిందన్నారు. ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించారని స్వయంగా ప్రధాని మోదీ పార్లమెంటులో చెప్పారన్నారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ పైకి వచ్చే వరకూ కేంద్రం చేయూత ఇవ్వాలని కోరారు. తనకు ఎవరి మీదా వ్యక్తిగతంగా కోపం లేదన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, నేడు బీజేపీ సహకారం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాణిక్యాలరావు, సిద్ధా రాఘవరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్సీ రామకృష్ణ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, జడ్‌పీ చైర్మన్ జానీమూన్, తదితరులు పాల్గొన్నారు