23న రాజరథం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నిరూప్ భండారి, అవంతిక షెట్టి జంటగా, ఆర్య ముఖ్యపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజరథం’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పలువురు టాప్ టెక్నీషియన్లు ఈ ట్రైలర్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా రాజకృష్ణన్ మాట్లాడుతూ- ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే చిత్రం ఇదని, ఇంత మంచి చిత్రాన్ని అందిస్తున్న టీమ్‌ను అభినందించకుండా ఉండలేమని తెలిపారు. దర్శకుడు అనూప్ మాట్లాడుతూ- టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. తప్పకుండా ఈ సినిమా నా కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు. అలాగే బాహుబలి, ఈగ, దృశ్యం లాంటి చిత్రాలకు కలరిస్ట్‌గా పనిచేసిన శివకుమార్ ఈ చిత్రానికి పనిచేయడం ఆనందంగా వుంది. సరికొత్త టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రానా వాయిస్‌తో ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ చిత్రాన్ని మార్చి 23న విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు.