మెయిన్ ఫీచర్

జైనుల దక్షిణ కాశి శ్రావణ బెళగళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైముల దక్షిణకాశీగా శ్రావణ బెళగళ ప్రసిద్ధి గాంచింది. శ్రావణ బెళగళలో ఇంద్రగిరి లేదా వింధ్యగిరి అని పిలువబడే కొండపై కొలువుదీరి బాహుబలి గోమఠేశ్వరుడు వున్నాడు. వింధ్యగిరి కొండపై అనేక కట్టడాలు మధ్య 58 అడుగుల ఎత్తు, 26 అడుగుల వెడల్పున బాహుబలి లేదా గోమఠేశ్వర మహామూర్తి విగ్రహం 72వేల 574 కిలోల బరువు కలిగి గిరిపై నిర్మించబడింది. ఈ భారీ విగ్రహం నెలకొల్పడానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. అందువల్ల గోమఠేశ్వరునికి 12 సంవత్సరాలకు ఒక్కసారి మహామస్తకాభిషేకం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన మహామస్తకాభిషేకం ప్రారంభమై 25వ తేదీన ముగిశాయ. 1008 రకాల సంగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాన్ని బాహుబలి మూర్తికి అంగరంగవైభోగంగా నిర్వహించారు.
జైనుల దక్షిణకాశిగా ప్రసిద్ధి చెందిన శ్రావణబెళగలను, వెళ్గొళ, దేవర బెళగోళ, శే్వత సరోవర, ధవళ సరోవర, గౌతమపుర అనే పేర్లతో పిలిచేవారని శాసనాలు చెపుతున్నాయి. రెండు కొండల మధ్యన ఉన్న అందమైన పట్టణము శ్రావణబెళగళ. కర్నాటకలోని హసన్ జిల్లా చెన్నరాయ పట్టటానికి 8 మైళ్ల దూరంలో వుంది.
శ్రావణ బెళగళ గిరిపై కొలువుదీరిన బాహుబలి విగ్రహాన్ని గంగ రాజైన రెండవరాజ మల్లన్న మంత్రి, దండనాయకునిగా వున్న చాముండరాయ అనే వ్యక్తి ద్వారా క్రీ.శ.981లో నిర్మించబడింది.
ఏకశిలతో చెక్కబడిన నగ్నమూర్తి బాహుబలి విగ్రహం ఒక అద్భుతమైన కళాకృతి చాముండరాయని చేత గోమఠేశ్వర విగ్రహం విభవ సంవత్సరం చైత్ర మాసం ఆదివారం కుంభలగ్నం క్రీ.శ.980- 984వ సంవత్సరంలో ప్రతిష్ఠింపబడింది. చాముండరాయుని గొమ్మట అని పిలుస్తున్నందున ఆయనచే నిర్మించినందున ఈ విగ్రహాన్ని గోమఠేశ్వర అని పిలుస్తారు.
జైముల ధర్మ శాస్త్రం ప్రకారం 24వ తీర్థంకరులలో మొదటి తీర్థంకరుడైన వృషభ దేవ, లేదా ఆదిదేవ అని పేర్కొన్న ఈయనకు మొదటిరాణి యశశ్వతి భరతుడు అనే కుమారుని పాటు వందమంది మగ కుమారులను, ఒక బాలికకు జన్మనిచ్చింది. రెండవ రాణి సునంద బాహుబలికి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. భరతునికి రాజ్యభారాన్ని తండ్రి అప్పగిస్తాడు. బాహుబలికి యువరాజ పట్ట్భాషేకం జరిపిస్తారు. భరతుని కోశాగారంలో ఒక చక్రం కనబడుతుంది. భరతునికి చక్రవర్తి కావాలనే కోర్కెతో యుద్ధంకు సన్నద్ధం అవుతాడు. చక్రవర్తిగా తనను అంగీకరించని రాజులపై దండయాత్ర చేసి వారిని ఓడించి చక్రంతో సహా రాజ్యానికి వస్తాడు. భరతుని వెంట వున్న చక్రం కోశాగారంలోకి వెళ్లకుండా బయటనే నిలిచిపోతుంది. అక్కడ వున్న రాజగురువులు మీ రాజ్యంలోనే శత్రువులు ఉన్నారని వారిని ఓడిస్తే తప్ప చక్రం కోశాగారంలోకి వెళ్లదని సెలవిస్తారు. ఆ శత్రువు బాహుబలి అని తేలుతుంది. దాంతో రాజ్యం కోసం భరతునికి, బాహుబలికి యుద్ధం ఇద్దరి మధ్యనే జరపాలని రక్తపాతం నివారించాలని రాజగురువులు నిర్ణయిస్తారు. భరతుడు, బాహుబలి మధ్య యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. చివరికి భరతుడు చక్రం వదలగా బాహుబలికి తగిలి ఆ చక్రం విరిగి పోతుంది. బాహుబలి యుద్ధంలో గెలిచి భరతునిపై విజయం సాధిస్తాడు. అయినప్పటికీ బాహుబలి రాజ్యపాలన చేపట్టక సోదరునితో రాజ్యం కోసం యుద్ధం చేయటాన్ని, శత్రుత్వాన్ని పెంచుకోవటం ధర్మ విరుద్ధమని భావించి భరతునికే రాజ్యం అప్పగిస్తాడు. శాంతి, ధర్మం, సహనశీలత కోసం బాహుబలి జైన సంప్రపాయం ప్రకారం కయత్సర్గ ప్రక్రియ ప్రకారం నిలబడి సంవత్సరాల తరబడి తపస్సుకు పూనుకుంటాడు. తపోదీక్షలో వున్న బాహుబలి కాళ్లకు లతలు పాకినా, జంతుజాలం కాళ్లను కుట్టి బాధలు కలిగించినా తపోదీక్ష చేసి మోక్షం పొంది నిర్వాణస్థితికి చేరుకుంటాడు. భరతుడు కూడ సోదరున్ని ఎదిరించి రాజ్యం పొంది నందుకు పశ్చాత్తాపం చెంది బాహుబలిని క్షమాపణ కోరుతాడు. తపోదీక్షతోనే అసలైన మోక్షమార్గం, జ్ఞానమార్గమని గ్రహించిన బాహుబలి గోమఠేశ్వరునిగా జైనమత ప్రచారం చేస్తూ తపోదీక్ష సాగించిన పర్వతంపైనే కైవల్యాన్ని పొందాడు.
చాముండరాయలు తన తల్లి కోర్కె మేరకు బాహుబలి తపోదీక్ష బూనిన పర్వతంపైనే ఏకశిలా విగ్రహం నిర్మిస్తాడు. ఆ విగ్రహానికి పుష్కరంకు ఒకమారు మహామస్తకాభిషేకం నిర్వహిస్తారు.. ఈ ఉత్సవంలో కుల,మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొంటారు. దేశంలో వున్న దిగంబర జైనస్వాములు నలుమూలల నుంచి ఈ ఉత్సవంలో పాల్గొనటం విశేషంగా కనబడుతుంది.

- తెలుగు ఈరన్న