క్రైమ్/లీగల్

ఖమ్మంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లా కేంద్రం నడిబొడ్డున అన్ని వసతులు ఉన్న కార్యాలయాలు అందుబాటులో ఉన్నా ఖమ్మం నగరం శివార్లలో కొత్త్భవనం నిర్మాణం వల్ల ప్రభుత్వ నిధులు వృథా అవుతాయంటూ ఎం విజయ భాస్కర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారించింది. అనంతరం పై మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయ లక్ష్మితో కూడిన ధర్మాసనం విచారించింది.
శిశు గృహల్లో ఏడాదిలో 18 మంది శిశువుల మృతి
*హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలోని శిశు సంరక్షణ మందిరాల్లో 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏడాదికాలంలో 18 మంది శిశువులు మరణించారని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. శిశు గృహాల్లో శిశువుల సంరక్షణకు తగిన చర్యలను తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ బాల హక్కుల సంఘం అధ్యక్షుడు పి అచ్యుత రావు దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. రాష్ట్రప్రభుత్వం తరఫున న్యాయవాది ఎస్ శరత్ కుమార్ శిశు గృహాల్లో 40 మంది మరణించారని చేసి అభియోగం సత్యదూరమని, 18 మంది మరణించారని కోర్టుకు తెలిపారు. పౌష్టికాహార లోపం వల్ల మరణించారని చేసిన అభియోగంలో కూడా నిజం లేదన్నారు. శిశువులకు వైద్యుల సిఫార్సులకు లోబడి ఆహారాన్ని సమకూర్చుతున్నామన్నారు. ఈ వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.