కడప

దళితులపై చిన్నచూపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, మార్చి 14: మున్సిపల్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక దళితుడు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవలసిన పాలకమండలి కానీ, అధికార యంత్రాంగం కానీ ఇంతవరకు స్పందించకపోవడం చాలాదారణమని, ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆదేశించారు. సుబ్బరాయుడు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని, గత వారం రోజులుగా మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు దీక్షలు చేపడుతున్నప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. బుధవారం దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి కార్మికుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. మృతిచెందిన కార్మికుని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవడంతో పాటు రావలసిన వేతనాల బకాయిలను, భార్యకు ఉద్యోగం వెంటనే ఇవ్వాలని కమిషనర్ శేషన్నను దీక్షా శిబిరానికి పిలిపించి ఆదేశించారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు కుమార్తె పేరున రూ.30 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను ఆ కుటుంబానికి ఎమ్మెల్యే తనవంతు సాయంగా అందజేశారు.

వార్డన్‌పై చర్యకు డిమాండ్
రాజంపేట టౌన్, మార్చి 14: డివిజన్‌లోని గోపవరం మండలం అట్లూరులో వార్డన్‌గా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడిన రమణారెడ్డిని వెంటనే విధుల నుండి తప్పించాలంటూ రాయలసీమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్‌రెడ్డి, ఎపి విద్యార్థి సంఘం జయవర్ధన్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎబీసీడబ్ల్యూఓ కార్యాలయం ఎదుట ఆర్‌ఎస్‌యు, ఎపీఎస్‌యు ఆధ్వర్యంలో వార్డన్‌పై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డన్‌గా సక్రమంగా విధులు నిర్వహించాల్సింది పోయి ఒక రోజు కూడా విధులు నిర్వహించకుండా బద్వేల్‌లోనే ఉంటూ కబ్జాదారులతో కలసి భూ దందాలకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. వార్డన్‌పై అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.

నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
రాజంపేట టౌన్, మార్చి 14:విద్యాశాఖ ఆదేశాలను ఉల్లంఘించి మార్నింగ్ స్కూల్ వేళలను పాటించకుండా, వేసవిలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు డీ.నాగేశ్వర అధికారులను కోరారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఒంటి పూట తరగతులు జరుగుతున్నాయని, ప్రవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలు విద్యాశాఖ ఆదేశాలను తుంగలోతొక్కి విద్యార్థులను ఇక్కట్లకు గురి చేస్తున్నాయన్నారు. విద్యాశాఖ అధికారులను ఒంటి పూట బడుల విషయంలో పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేలా చూడాలన్నారు.

టెన్త్ పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
* డిఎస్పీ లక్ష్మినారాయణ
రాజంపేట టౌన్, మార్చి 14:రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో పదవ తరగతి పరీక్షలు జరుగు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని డిఎస్పీ లక్ష్మినారాయణ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ పరీక్షాకేంద్రాల వద్ద ఎవరు గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున పోలీస్ శాఖ ముందస్తు అనుమతి లేనిదే ఎవరు ఏలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, మరే నిరసన కార్యక్రమాలు చేపట్టరాదన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి జెరాక్స్ సెంటర్‌ను తప్పనిసరిగా మూసి ఉంచాలన్నారు. ఏలాంటి కాఫీయింగ్ వంటి నేరపూరిత చర్యలకు పాల్పడినా కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పరీక్షాకేంద్రంలోకి పరీక్షలు వ్రాసే విద్యార్థులు తప్ప తల్లిదండ్రులు, బంధువులు, మరే ఇతర వ్యక్తులను అనుమతించబడదన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఏలాంటి మైకులు, లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదన్నారు. తల్లిదండ్రులు, బంధువులు, ప్రజలు టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని డిఎస్పీ కోరారు.