దేనికైనా రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ల వరుస మారుతోంది. ఇపుడు ఏ సినిమాలో చూసినా హీరోయిన్ల గ్లామరే ప్రధానాకర్షణగా మారింది. అందుకనే హీరోయిన్లు కూడా గ్లామర్ కోసం ప్రత్యేకంగా ముస్తాబవుతున్నారు. ఇక నటన విషయం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. హీరోయిన్ అంటే ఇపుడు అంతా గ్లామరే. కానీ నటిగా కూడా పేరు తెచ్చుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ఈ కోవలో తను కూడా నటిగా నిరూపించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది ..తమిళ భామ ఆండ్రియా. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ఈమెకు అనుకున్న స్థాయిలో క్రేజ్ దక్కలేదు. దానికితోడు ఫైర్‌బ్రాండ్‌గా ఇమేజ్ తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ- కథ డిమాండ్ చేస్తే దేనికైనా రెడీ అని చెబుతోంది. ఈమధ్య హీరోయిన్లందరూ గ్లామర్ బాట పట్టారని అడిగితే, ప్రస్తుతం అందరూ అలాంటి కథలే చేస్తున్నారని, హిందీలో రాధిక ఆప్టే చేసిన తరహాలో కథ డిమాండ్ చేస్తే తాను కూడా న్యూడ్‌గా నటిస్తానని చెప్పి షాకిచ్చింది. ఆండ్రియా న్యూడ్‌గా నటిస్తాననడం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

చిత్రం..ఆండ్రియా