రాష్ట్రీయం

ఈ బంధం.. కలకాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ భద్రాచలం రాములోరికి టీటీడీ పట్టు వస్త్రాలు
* నాలుగేళ్లలో 2 లక్షల వివాహాలు* రాజకీయ నేతల మధ్య బాంధవ్యాలు
* ఏపీ సాహితీవేత్తలకు సన్మానం
హైదరాబాద్, మార్చి 26: సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పటికీ, రెండు రాష్ట్రాల ప్రజ ల మధ్య వివాహ సంబంధాలు, సాహితీ సంబంధాలు, ఆధ్యాత్మిక సంబంధాలకు ఎలాంటి ఆటం కం కలగడం లేదు. రాష్ట్ర విభజన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నీటి తగాదాలు ఎలా ఉన్నప్పటికీ, రెం డు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని నాలుగేళ్ల పరిస్థితి స్పష్టం చేస్తోంది. సోమవారం జరిగిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి తిరుమల- తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటీ వ్ ఆఫీసర్ శ్రీనివాసరాజు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ) శేషాద్రి తదితరులు ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, ముత్యాల దండలతో భద్రాచలం వ చ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు సమర్పించిన పట్టువస్త్రాలతో పాటు టీటీడీ తరఫు న పట్టువస్త్రాలను ఆధికారులు సమర్పించారు.
తెలంగాణ-ఏపీ ప్రజల మధ్య పెద్దఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. తెలంగాణకు చెందిన అమ్మాయిలను ఏపీలోని అబ్బాయిలు, ఏపీలోని అమ్మాయిలను తెలంగాణ అబ్బాయిలు వి వాహం చేసుకుంటున్నారు. ఇలా నాలుగేళ్లలో 2లక్షల వివాహాలు జరిగాయి. రాజకీయ నేతల పిల్లల వివాహా లు కూడా ఈ విధంగా జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి (మాజీ టీడీపీ నేత) కూతురును ఏపీ అబ్బాయికి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. ఇదేవిధం గా పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల ప్రజల మధ్య బాం ధవ్యాలు పెరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్‌తోసహా తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఏపీకి చెందిన ప్రజలు ఆస్తులు కొనుగో లు చేసి హాయిగా జీవిస్తున్నారు. ఏపీకి చెందిన ల క్షలాది మంది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలు తదితర ఉపాధి పనులు చేపట్టి జీవిస్తున్నారు. హైదరాబాద్‌లోని సినీరంగం కూడా ఏపీకి చెందిన నిర్మాతలు, దర్శకులు తదితరుల చేతుల్లో కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ తె లుగు మహాసభల సందర్భంగా ఏపీకి చెందిన కవు లు, సాహితీవేత్తలు చాలామందిని ఘనంగా సన్మానించారు. విచిత్రమేమిటంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టులు పొందుతున్న వారిలో ఏపీకి చెందినవారు చా లామందే ఉంటున్నారు.