Others

దారపు ధగధగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంకరణ మన సంప్రదాయం. చక్కటి పట్టుచీర, నగలతో కళకళలాడే అమ్మాయిలు ఫంక్షన్‌లలో అటూ ఇటూ తిరుగుతుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో కదూ! బంగారు ధరలకు రెక్కలొచ్చాక వన్‌గ్రామ్ గోల్డ్ హవా ఎక్కువైంది. కానీ వీటిని కూడా బరువనుకున్నారేమో.. అతి తేలికైన దారపు నగలు వచ్చేశాయి. కాలేజీకెళ్ళే టీనేజీ దగ్గర్నుంచి ఆఫీసుకెళ్ళే అమ్మాయిలవరకూ ప్రతి ఒక్కరి మనసూ దోచిన నగలు దారపు నగలు. వేసుకున్న దుస్తులకు మ్యాచ్ అయ్యే నగలు వేస్తే ఉండే సొగసే వేరు. అందుకే ఈ నగలకు ప్రాచుర్యం ఎక్కువ. ఎందుకంటే అన్ని రకాల దారాలు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని
ఉపయోగించి నగలను తయారుచేసేయొచ్చు. ఈ నగలు సంప్రదాయంగానూ ఉంటాయి.. ఫ్యాషన్‌గానూ ఉంటాయి. అందుకే ఇవి ఫ్యాషన్ ప్రియులకు ఫేవరేట్ అయిపోయాయి. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఈ సిల్కుదారాలను తెచ్చుకుని ఇంటి దగ్గర వారికి నచ్చిన డిజైన్లను వారే తయారుచేసుకుంటున్నారు. వేసుకున్న దుస్తులకు తగినట్లుగా మనం స్వయంగా తయారుచేసుకున్న ఆభరణాలు వేసుకుంటే ఆ అందమూ, ఆనందమే వేరు కదూ..!