Others

కలియుగ సావిత్రి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీత, ద్రౌపది, సతీసావిత్రి వంటి మహాపతివ్రతలు నడియాడిన దేశం మనది. ఆ బాటలోనే నడుస్తోంది బిమ్లాదేవి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన బిమ్లాదేవి అనే మహిళ నరాల సంబంధిత వ్యాధితో కుడికాలు కోల్పోయిన తన భర్త బదన్‌సింగ్‌ను గత కొన్ని నెలలుగా భుజాలపై ఆస్పత్రికి మోసుకెళుతోంది. కుటుంబం కోసం ఓ మహిళ ఏమైనా చేయగలదు అనేందుకు మరో నిదర్శనం!
బదన్‌సింగ్‌కు వీల్‌చైర్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు అతను దివ్యాంగుడనే ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మన్నారు. దీంతో ఆమె ఆ సర్ట్ఫికెట్ కోసం భర్తను భుజాలపై మోస్తూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చాలాకాలంగా తిరుగుతోంది. అయినా అధికారులు ఏమాత్రం కనికరించడంలేదు. బిమ్లాదేవి తన భర్తను భుజంపై మోసే చిత్రం మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన ఉత్తరప్రదేశ్ మంత్రి భూపేంద్ర చౌదరి స్పందించి వారికి సహాయం అందకపోవడం సిగ్గుచేటని, వెంటనే వారికి సహాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
*