27న ఆచారి యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్ణు మంచు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికాయాత్ర’ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది. చిత్ర ట్రైలర్‌కు అద్భుత స్పందన రాగా, ఎస్‌ఎస్ తమన్ స్వరపరిచిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఈ చిత్రానికి జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. విష్ణు, జి.నాగేశ్వర్‌రెడ్డిల కలయికలో ‘దేనికైనారెడీ’, ‘ఈడోరకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ‘ఆచారి అమెరికా యాత్ర’కూడా అదే తరహా వినోద భరిత చిత్రం కావడంతో విష్ణు, నాగేశ్వర్‌రెడ్డిలు హ్యాట్రిక్ హిట్ సాధిస్తారని నిర్మాతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ ఈ చిత్రానికి మరో హైలైట్‌గా నిలవనుంది. విష్ణు సరసన ప్రజ్ఞజైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం కీర్తిచౌదరి మరియు కిట్టు పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించగా యమ్.ఎల్.కుమార్‌చౌదరి సమర్పిస్తున్నారు. సమ్మర్‌లో వస్తున్న భారీ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్. అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్‌లలో షూటింగ్ జరుపుకున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 27న భారీగా విడుదల చేయనున్నారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస్‌రావు, పోసాని కృష్ణమురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్‌సింగ్, సురేఖవాణి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు: సిద్ధార్థ్, ఎడిటింగ్: వర్మ, సంగీతం: ఎస్.ఎస్.తమన్, మాటలు: డార్లింగ్ స్వామి, నిర్మాతలు: కీర్తిచౌదరి, కిట్టు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి.