రాష్ట్రీయం

ఓల్డ్ సిటీకి వెయ్యి కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో వెయ్యి కోట్ల రూపాయలతో వౌలిక సదుపాయాల కల్పనకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పాతబస్తీని వరదలకు ఆస్కారం లేకుండా, మురికి నీరు రోడ్లపై ప్రవహించకుండా, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా, మంచినీటి ఎద్దడి లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్టు వెల్లడించారు. రంజాన్ నెల ప్రారంభానికి ముందే పాతబస్తీలో పర్యటించి ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఆ లోగా పాతబస్తీ అభివృద్ధికి చేపట్టడానికి సమగ్ర ప్రణాళికలను రూపొందించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సోమవారం మున్సిపల్ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, మెట్రో వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్, రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, హైదరాబాద్ కలక్టర్ యోగితారాణా తదితర అధికారులతో సిఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇక నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నెలకు రెండుసార్లు పాతబస్తీ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సిఎం ఆదేశించారు. వౌలిక సదుపాయాలే కాకుండా రూ.1600 కోట్లతో మూసినది ప్రక్షాళన, ఆధునీకరణ రూ.1200 కోట్లతో చేపట్టిన మెట్రోరైలు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమైక్య పాలనలో పాతబస్తీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కనీస వౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని సిఎం అన్నారు. పాతబస్తీవాసులు 30 ఏళ్లుగా విద్యుత్ కోతలు, మంచినీటి ఎద్దడి, మురికి నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగడానికి వీలు లేదన్నారు. విద్యుత్ సమస్యను శాశ్వతంగా దూరంగా చేయడానికి కొత్తగా మరో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి స్థల సేకరణ చేయాలని సిఎం ఆదేశించారు. ఇక్కడ విద్యుత్ వ్యవస్థను మెరుగుపర్చడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పాతబస్తీలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని, దీని కోసం ఏడు చోట్ల రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. ఎప్పుడో నిజాం కాలంలో, బూర్గుల రామకృష్ణారావు సిఎంగా ఉన్న హయాంలో వేసిన పైపు లైనే్ల ఉన్నాయన్నారు. వీటిని మార్చి కొత్త పైపు లైన్లు వేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. వర్షం వస్తే పాతబస్తీలో ఇళ్లలోకి నీరు వస్తుందన్నారు. ఎక్కడా వర్షపునీరు, మురికి నీరు నిల్వకుండా రూ. 200 కోట్లతో నాలాల ఆధునీకరణ, వెడల్పు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి స్ట్రాటెజిక్ రోడ్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డిపి) పథకంలో చేపట్టిన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, మూడు కొత్త వంతెనలు నిర్మించాలని సిఎం సూచించారు. విద్యుత్, మంచినీరు, రోడ్లు, మురికి కాలువలు, ట్రాఫిక్ ఈ ఐదింటికీ దాదాపు రూ. 1000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచన వేసినట్టు సిఎం వివరించారు. ఇటీవల ఏర్పాటు చేసిన దవాఖాన్లకు మంచి స్పందన లభించిందని, ఇలాంటి దవఖానాలు నగరంలో 200 వరకు ఉన్నాయన్నారు. వీటితో పాటు వీలైనన్ని ఎక్కువ చోట్ల డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని సిఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరం తెలంగాణకు గుండెకాయ లాంటిదని, ఇక్కడ మంచినీటి సమస్య తలెత్తకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం కృష్ణానది నుంచి మూడు దశల్లో 16.5 టిఎంసిలు, గోదావరి నుంచి 10 టిఎంసిల నీటి అందిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నగరంలో మంచినీటి కోసం కేశవాపురం వద్ద 10 టిఎంసిల సామర్ధ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తున్నామన్నారు. దీనితో పాటు ఓఆర్‌ఆర్ చుట్టూ చిన్న, చిన్న రిజర్వాయర్లు నిర్మించి నీరు నిలువ చేసుకోవాలని సిఎం సూచించారు.