ఆంధ్రప్రదేశ్‌

రాజధాని రణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజధాని అమరావతిపై అసెంబ్లీ రణరంగమే అయ్యింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పరస్పర దూషణలు, నిందారోపణలు దద్దరిల్లింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో అట్టుడికింది. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని భూములను బినామీ పేర్లతో మంత్రులు కొనుగోలు చేశారన్న ఆరోపణలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. బుధవారం అసెంబ్లీలో ప్రతిపక్షనేత జగన్ మాట్లాడుతూ అమరావతిని అడ్డం పెట్టుకుని సిఎం చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెరలేపారని దుయ్యబట్టారు. అమరావతి వద్ద రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులకు ముందుగానే తెలిపారని, దీంతో అమరావతి పరిసరాల్లో బినామీ పేర్లతో మంత్రులు భూములు కొనుగోలు చేశారని విపక్ష నేత జగన్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, ఓత్ ఆఫ్ సీక్రసీకి భంగం కలిగించారని అభియోగం మోపారు. జగన్ వ్యాఖ్యలపై సభలోవున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తాను చేసిన అభియోగాలను జగన్ తక్షణం సభలో నిరూపించాలని, మంత్రులు భారీగా భూములు కొన్నట్టు ఆధారాలు చూపిస్తే బాధ్యులను డిస్మిస్ చేస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. లేనిపక్షంలో జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? సభకు క్షమాపణ చెబుతారా? అని చంద్రబాబు సవాల్ విసిరారు. భూముల వ్యవహారంపై సిబిఐ లేదా ఎటువంటి విచారణలు అవసరం లేదన్నారు. సభే సుప్రీం అంటూ, ఇక్కడే ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. సిబిఐ విచారణలతో రాజధాని అభివృద్ధిని అడ్డుకుంటారా?, రైతులకు అన్యాయం చేస్తారా అంటూ జగన్‌పై విరుచుకపడ్డారు. ఈ అంశంపై జగన్ బదులిస్తూ తాను చేసిన అభియోగాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉన్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తుల అంశాన్నీ విచారణ పరిధిలోకి చేర్చాలని సవాల్ విసిరారు. దీంతో సభలో తీవ్ర దుమారం చెలరేగింది. వైకాపా, తెదేపా సభ్యుల మధ్య దూషణలపర్వం మొదలవడంతో, సభలో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థంగాని పరిస్థితి తలెత్తింది. జగన్ మాట్లాడుతుండగా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెంనాయుడు, యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, పి మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు జోక్యం చేసుకుని తీవ్రస్థాయిలో జగన్‌పై ఆరోపణలతో విరుచుకుపడ్డారు.

చిత్రం....

సభ్యుల పరస్పర ఆరోపణలతో గందరగోళంగా మారిన ఏపీ అసెంబ్లీ