నయా ప్లాన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ హాట్ భామ నయనతార భలే ప్లాన్ వేసిందబ్బా!! ఇప్పటికే ఈ అమ్మడు దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఓ ఇంటివారు కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి షికార్లుచేయడం.. డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడు తన బాయ్‌ఫ్రెండ్‌ని హీరోగా పరిచయంచేసే పనిలో పడిందట!! తాజాగా విఘ్నేష్‌శివన్ ఓ మంచి కథను సిద్ధం చేసాడట. అందులో నయనతారను హీరోయిన్‌గా తీసుకున్నాడట. అయితే హీరోకోసం అనే్వషణలో పడ్డ విఘ్నేష్‌కు హీరో ఎవరో ఎందుకు నువ్వే చేయొచ్చుగా అని సలహా ఇచ్చిందట. అంతేకాదు.. తనతో సినిమా చేయడానికి వచ్చే నిర్మాతలకు కూడా విఘ్నేష్‌ని హీరోగా తీసుకుంటేనే నేను హీరోయిన్‌గా నటిస్తానని కండిషన్స్‌పై కండిషన్స్ పెడుతుందట. తన బాయ్‌ఫ్రెండ్‌ని హీరోగా చూడాలని ప్లాన్ వేసినట్టుంది.. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా? చూడాలి.