క్రైమ్/లీగల్

ప్రైవేటు బ్యాంకుల్లో వెయ్యి కోట్ల డిపాజిట్‌పై ప్రజావ్యాజ్యం దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 22: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో హుండీలో సమర్పించిన కానుకల ద్వారా సమకూరుతున్న నిధుల్లో వెయ్యి కోట్ల రూపాయలను వడ్డీ అధికంగా ఇస్తున్నారని ఇండస్ ఇండ్ బ్యాంకులో డిపాజిట్ చేయడాన్ని తప్పుపడుతూ తిరుపతికి చెందిన సామాజికవేత్త, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో శనివారం ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును స్వీకరించిన న్యాయస్థానం డిపాజిట్లపై టీటీడీని వివరణ కోరినట్లు తెలుస్తోంది. టీటీడీకి సంబంధించిన నాలుగు వేల కోట్ల రూపాయల నిధుల్లో మూడు వేల కోట్ల రూపాయలను టీటీడీ పలు జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. వెయ్యి కోట్లను ఇండస్ ఇండ్ అనే ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేసింది. టీటీడీ యాజమాన్యం నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిందని పిటిషనర్ నవీన్‌కుమార్‌రెడ్డి న్యాయస్థానం ముందు తన వాదనను వినిపించారు. ఈ డిపాజిట్ల వ్యవహారం బయటకు పొక్కగానే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఈక్రమంలో టీటీడీ ఈవో ఏకె సింఘాల్ విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి నిబంధనలకు అనుగుణంగానే ప్రైవేటు బ్యాంకులో నిధులు డిపాజిట్ చేసినట్లు వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనంటూ రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం ఈ కేసును పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీటీడీ ఈఓతో పాటు, ప్రైవేటు బ్యాంకు యాజమాన్యాన్ని కూడా కక్షిదారులుగా చేర్చడం గమనార్హం.