ఆంధ్రప్రదేశ్‌

నేటితో ముగియనున్న ఏపీ ఎంసెట్-2018

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 24: ఏపీ ఎంసెట్-2018లో భాగంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న పరీక్షలు మంగళవారంతో తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తయ్యాయి. బుధవారం అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. మంగళవారం నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో మొత్తం 93.69 శాతం హాజరు నమోదయినట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు చెప్పారు. చివరి రోజు మొత్తం 64,772 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరుకావల్సి ఉండగా 62,2307 మంది హాజరయ్యారని, 2505 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి మంగళవారం వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన ఇంజనీరింగ్ పరీక్షలకు మొత్తం లక్షా 99వేల 437 మంది హాజరుకావల్సి ఉండగా లక్షా 90వేల 924 మంది మంది హాజరయ్యారని, 8513 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మూడు రోజులూ మొత్తం 95.73 శాతం హాజరు నమోదయ్యిందన్నారు. బుధవారం అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగానికి 76,666 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 43 రీజినల్ సెంటర్లు, హైదరాబాద్‌లో 3 రీజనల్ సెంటర్ల పరిధిలోని 137 పరీక్షా కేంద్రాల్లో అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మంగళవారం రాత్రి నుంచి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఈ మెయిల్ ఐడీలకు రెస్పాన్స్ షీట్లు వెళ్ళేలా చర్యలు తీసుకున్నామని కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఎవరైనా విద్యార్థులు తమ మెయిల్ ఐడీ తప్పుగా పంపిన పక్షంలో బుధవారం ఉదయం నుండి రెస్పాన్స్ షీట్లు వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకునే విధంగా పొందుపరుస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగం మాస్టర్ కాపీ, ప్రాథమిక కీను బుధవారం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలను ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామన్నారు. ఎంసెట్‌కు సంబంధించి ఏ విధమైన సందేహాలున్నా నివృత్తి చేసుకోవడానికి 0884-2340535, 0884-2356255 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కన్వీనర్ డాక్టర్ సాయిబాబు కోరారు.