సబ్ ఫీచర్

మోదీకి సరితూగే మొనగాడెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు దేశమంతటా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి..! నిజమే అనుకుందాం.. కానీ- మోదీని పదవి నుంచి దించేయడమంత తేలిక కాదేమో- ‘్భవి ప్రధాని’ని ఎన్నుకోవడం. సార్వత్రిక ఎన్నికలకు దాదాపుగా ఇంకా సంవత్సరం పైనే సమయం ఉంది. మరి- ఈ పూర్తి సంవత్సరకాలం దేశంలో రాష్టప్రతి పాలన సాగించరు కదా! దీనిపై విపక్ష నేతలు, విజ్ఞులు ఏమంటారు?
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అంతరంగం స్పష్టమయింది కదా! మోదీపైన, కేంద్ర ప్రభుత్వంపైన ఆయన ఇటీవల చేసిన విస్పష్ట హెచ్చరికలో అంతరార్థం ఏమిటో అందరికీ తెలిసింది కదా? ‘మోదీ.. మాతో పెట్టుకోకు.. ఏపీలోని 25 ఎంపీ సీట్లను మేమే గెలిచి- కాబోయే ప్రధానిని నిర్ణయిస్తాం’ అని చంద్రబాబు అన్నారు.
ఇక శతాధిక కాంగ్రెస్ పార్టీకి యువ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే తన ధోరణిని స్పష్టం చేశారు. తనను ఢిల్లీలో కలిసిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేసేది భాజపా కోసమే.. మజ్లిస్ భాజపాకు కోవర్టు’ అని రాహుల్‌జీ సెలవిచ్చారు.
తెదేపా, కాంగ్రెస్ నేతల ఉద్ఘాటనలలోని వాస్తవాల గురించి ప్రజలే ఆలోచించుకోవాలి, తమ భవిష్యత్ కార్యాచరణను తేల్చుకోవాలి, తప్పదు గదా! ప్రస్తుత ధోరణిని విశే్లషించి చూస్తే- రాహుల్‌జీ ఏ మాత్రం కేసీఆర్ కోరుకుంటున్న ‘ఫ్రంట్’ను ఫ్రంట్‌ని బలపరచరని స్పష్టమవుతోంది.
ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మన రాజకీయ నాయకుల మాటలను ఎంత మాత్రం నమ్మలేం. ఊసరవెల్లుల లాగా వీరు అవసరమైనపుడు రంగులు మార్చటంలోనూ నిష్ణాతులే! ఒకటి మాత్రం తథ్యం కదా.. రాబోయే కాలంలో రాహుల్‌జీ తప్పక ప్రధాని పదవికి ఒక అభ్యర్థి అని ఒప్పుకోవాలి. సిపిఎం నేతలు ఎంత ఘనంగా మన హైదరాబాద్‌లో ఇటీవల జాతీయ మహాసభలు జరిపినా, కాంగ్రెస్‌తో పొత్తు విషయమై ‘కామ్రేడ్లు’ స్పష్టత ఇవ్వలేదు.. సరైన సమాధానం సమాధానం చెప్పలేదు..
దక్షిణ భారతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఫలితాల్లో రాజెవరో, మంత్రి ఎవ్వరో ఆ రాష్ట్రానికి సంబంధించి స్పష్టత వస్తుంది. మరి ప్రధాని పదవి గురించి ఎవరి సత్తా ఎంతుండబోతుందో, మనమిప్పుడే ఊహించలేం గదా! ఈ విషయం కర్నాటక ఎన్నికల ఫలితాలు తేల్చలేవు. ప్రధాని పదవికి తాము మాత్రమే సమర్థులం అనుకునేవాళ్లు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ఫెడరల్ ఫ్రంట్‌తో కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ‘ఫైర్‌బ్రాండ్’ మమతా బెనర్జీ వగైరా వగైరా..
ఇక, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి కొద్దిరోజుల క్రితం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు స్పష్టం చేశారు. ఇంకొన్ని అంశాలపై సూటిగా సమాధానాలు ఇవ్వలేదు. ఆయన చెప్పిన మాటల ప్రకారం-
* కాంగ్రెస్‌తో సీపీఎంకు అలయెన్స్ ఉండదు. వారి ప్రయత్నమంతా బిజెపిని ఓడించటానికే.
* ఈ దేశంలో రాష్ట్రాల మధ్య అనేక విభేదాలున్నాయి. భారతదేశం ఏకశిలా రూపం కాదు (ఇండియా ఈజ్ నాట్ ఎ మోనోలిథిక్ కంట్రీ) రాష్ట్రాల మధ్య అనేక భేదాలున్నాయి.
* ఉత్తరప్రదేశ్‌లో బియస్‌పి, ఎస్‌పి కలిస్తే గనుక అక్కడ కాంగ్రెస్-వామపక్షాలు సోదిలోకి రావు. అలాగే బిహార్‌లో యాదవులు-ముస్లింలు కలిస్తే అంతే. దక్షిణ భారతంలో కాంగ్రెస్ పార్టీ అసలు ముఖ్య ఆటగాడి కింద లెక్కలోకి రాదు.
* 1996లో యునైటెడ్ ఫ్రంట్ అనేది ఎన్నికల తరువాతే ఏర్పడింది, 2004లోనూ యుపిఎ అనేది ఎన్నికల తరువాతే ఏర్పడింది. ‘కూటములు’ ఎన్నికల తరువాత ఒక్కో రాష్ట్రంలోని పరిస్థితి ఆధారంగా ఏర్పడినవే కాని, ముందుగా ఒకటనుకుని ఏర్పడినవి కావు.
* కర్నాటకలో ఎలా వోటు వేయాలంటారా? లెఫ్ట్ పార్టీ ఉంటే దానికి వోటేయండి, అది లేకపోతే బిజెపిని ఓడించేందుకు బలమైన అభ్యర్థికి వోటేయండి.
ఇలా పలు విషయాలు చెప్పినా, సీతారాం ఏచూరికి కొన్ని విషయాల్లో స్పష్టత లేదు.
ఇంతకూ మన రాజ్యాంగంలో దీనిమీద స్పష్టత ఏర్పడింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే! మనం 1977 జనవరి 3నుంచి ‘సావరిన్, సోషలిస్టు, సెక్యులర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్’గా ఏర్పడ్డాం.
ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ సోషలిస్టు రిపబ్లిక్ ఉంది? దానిని మనం ఆదర్శంగా తీసకుందామంటే, సీతారాం ఏచూరి వద్ద సమాధానం లేదు. ప్రపంచంలో రష్యాలో కాదు చైనాలో కాదు ఫలానా దేశంలో సోషలిజం ఉంది.. దానిని మనం ఆదర్శంగా తీసుకుందామని బయటికి రావటం లేదు. సీపీఎం అగ్రనేత సుదీర్ఘమైన ప్రకటనలో తెలిసేదిదే.
భారతదేశం అనేక రాష్ట్రాల సమాహారం. ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో జిల్లాలో పరిస్థితులు విభిన్నంగా ఉంటున్నాయి. భారతీయ జనతాపార్టీని తొలగించేందుకు, ఎక్కడ ఏది వీలయితే, ఎక్కడ ఏది అనుకూలమనుకుంటే, దానిని అనుసరిస్తాం. అంతేకాని ఒక విధానం అంటూ ఏదీ లేదు.. అనేది మాత్రమే సుమా!
ఇక కొన్ని అతి విశేష వార్తల సంగతి చూడండి..
గత నెల 25వ తేదీన దిగ్భ్రమ కలిగించే వార్తలు వచ్చాయి..
‘మా చేతులు రక్తసిక్తాలే’ అంటూ కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు- అదీ ఎక్కడ? అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో..
ఆ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమంలో- కాంగ్రెస్ హస్తంపై ముస్లిం రక్తపు చారికలున్నాయని ఒక విద్యార్థి ఆరోపిస్తే, ఖుర్షీద్ ‘ఔను మా చేతులు రక్తసిక్తాలే’- నేను కూడా కాంగ్రెస్‌లో భాగమే, మా చేతులపై రక్తపు చారికలున్నమాట వాస్తవమే అని ఉద్ఘాటించారు. ఈ పరిస్థితులపై ఏమందాం?
ప్రత్యేక రాష్టమ్రే మా లక్ష్యం అంటూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీలో రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి చేసిన ప్రకటన ఇది. ఇటీవల కడపలో ఈ పార్టీ సమావేశం జరిగింది. ఆ ప్లీనరీలో ప్రత్యేక రాష్ట్రం గురించి దీర్ఘ ప్రసంగాలు జరిగాయి. ఇలాంటి విషయాలపై సీతారాం ఏచూరి ఏమీ మాట్లాడలేదు. అంటే సిపిఐ, సిపిఎంలు కాక, ఇపుడు ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధనే ఆదర్శంగా కమ్యూనిస్టులతో కొత్త పార్టీ ఏర్పడిందన్నమాట.
ఇక- కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఉద్ఘాటన ఇది. భారతీయ జనతాపార్టీని 2019 ఎన్నికలలో చిత్తుగా ఓడించేందుకు, దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. సర్దుబాటు స్ఫూర్తిని ప్రదర్శించాలి. భాజపా ప్రత్యర్థులందరినీ ఒక చోటికి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్సే కృషిచేయాలి. అయితే- దిగ్విజయ్ సింగ్ ఓ ‘హెచ్చరిక’ లాంటి షరతు విధించారు. మోదీపై ప్రతిపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవ్వరినీ ప్రకటించకూడదు. దీన్ని ఏమంటారు? మోదీకి ప్రత్యామ్నాయం చూపలేని అసమర్థులంతా- కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేయమంటున్నారు. విజ్ఞులైన ప్రజలు, నిజమైన దేశభక్తులు ఆలోచించవలసిన విషయం కాదా ఇది.

-చాణుక్య