Others

ఆరోగ్యానిచ్చే రత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్లు చెదిరే కాంతుల్ని వెదజల్లే నవరత్నాలు భారతీయులందరికీ సుపరిచితమే.. వాటికున్న క్రేజ్ కూడా అందఠికీ తెలిసిందే.. వాటితో సమానంగా పోటీపడే సహజాతి రత్నమే ఈ టూర్‌మలీన్. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోతగినది వాటర్‌మెలన్ టూర్‌మలీన్. చుట్టూ ఆకుపచ్చగా, మధ్యలో ఎర్రగా.. డబుల్ కలర్‌లో అందంగా ముచ్చటగొలుపుతుంది. ఇది టూమరిలీన్ రాళ్లలో ఒకరంగు మాత్రమే.. ఇందులో బోలెడు రంగులు ఉన్నాయి. గులాబీ, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గోధుమ.. ఇలా బోలెడు.. ఈ రత్నాలు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. కారణం ఇందులో టూర్‌మలీన్ అల్యూమినియం, ఐరన్, లిథియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం.. మొదలగు ఖనిజాలు ఉంటాయి. ఈ రత్నాలు అందంగా ఉండటమే కాదండోయ్.. ఇవి ధరించడం వల్ల చాలా ఆరోగ్యం కూడా. విభిన్న ఖనిజాల సమ్మేళనం కారణంగా ఈ రత్నాలు విద్యుచ్ఛక్తి లక్షణాలను కలిగి ఉంటాయి. ఫలితంగా ఇవి మానసిక, శారీరక ఆరోగ్యం మీద మంచి ప్రభావాన్ని కలిగిస్తాయని జ్యోతిష్యులు నమ్ముతున్నారు. వీటిని పెట్టుకోవడం వల్ల రక్తనాళాలోని అడ్డంకులు తొలిగి హృదోగాలు రావని శాస్త వేత్తలు చెబుతున్నారు. ఈ రత్నాలు ఒకప్పుడు శ్రీలంకలో మాత్రమే దొరికేవి. సింహళీయులు వీటిని తూరమలి, తోరమల్లి అని పిలిచేవారు. దీన్ని పెట్టుకోవడం వల్ల ఆత్మస్థైర్యాన్ని చేకూరుతుందని, ఒత్తిడినీ, ఆందోళననీ తగ్గిస్తుందనీ వారు నమ్ముతారు. ఇప్పుడు ఇవి బ్రెజిల్, నైజీరియాలోనూ దొరుకుతున్నాయి. ఏది ఏమైనా ఈ రత్నాలతో చేసిన ఆభరణాలు చాలా అందంగా ఉంటూ నేటి ఫ్యాషన్ ప్రియుల్ని కట్టిపడేస్తున్నాయి. అంతే డబుల్ కలర్స్‌లో లభించడం వల్ల మ్యాచింగ్‌లకు కూడా చక్కగా అమరుతున్నాయి. మనం కూడా ఆ ఆభరణాలపై ఓ లుక్ వేద్దామా!