Others
పుప్పొడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 May 2018
-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి 9052116824
కాలయంత్రమెపుడైనా ఎక్కితే బాగుణ్ణు
మనం వీడిన క్షణాన్ని గుర్తించి దూకెయ్యడానికి
మరణం ముగింపు కాదు విరామం!
మళ్లీ మనల్ని స్వర్గ్ధామం కలుపుతుందిగా!!
జీవిత నౌకకి జ్ఞాపకాల లంగరు !
ఇక అక్కడే చక్కర్లు!!
జీవితసారాన్ని కలంలో సిరాగా నింపానుగా!
కథలు పుట్టుకొస్తున్నాయి. కుప్పలు కుప్పలుగా !!
వౌనమూ మదిని పట్టి చీల్చేస్తుంది!
కత్తికంటే పదునుగా అదును చూసుకుని!!
రాలుపూల పాఠ్యాంశం!
వాడినా .. ఊడ్చినా.. సౌరభాలే వెదజల్లమనీ!!
స్వగతమెప్పుడూ ఇంతే ...
మాటని దాటేస్తూ.. మనసుని తొలిచేస్తూ!!
కల అయితే కరిగిపోయింది!
చిరునవ్వు నా పెదాలపై చిరంజీవే!!
భ్రమరానికి ఎంత అత్యాశ!
మధువు కోసం నీ అధరాలపై వాలింది