క్రైమ్/లీగల్

రూ. 2.35 కోట్ల విలువైన విత్తనాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: విత్తనాల తయారీ తేదీ, ముగిసే గడువు తేదీ వంటి విషయాలను ముద్రించకుండానే విత్తన కంపెనీలు విత్తనాలను ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించి రూ.2.35 కోట్ల విలువైన విత్తనాలను తూనికలు కొలతల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా విత్తన తయారీ కేంద్రాల్లో విస్తత్ర తనిఖీలు నిర్వహించి 154 కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం తెలిపారు. రైతులను మోసం చేసే విధంగా విత్తన కంపెనీలు నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తే భవిష్యత్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాల్సి వస్తుందని కంట్రోలర్ హెచ్చరించారు. ఇంతేకాకుండా తూకం, కొలతల విషయంలో మోసాలకు పాల్పడితే అసలు క్షమించరాని నేరమని అన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. విత్తనాల విషయంలో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో అధికంగా నిజామాబాద్‌లో 28, నల్గొండలో 14, వరంగల్‌లో 8, కరీంనగర్‌లో 13, పెద్దపల్లిలో 14, మేడ్చల్‌లో 15, సిద్దిపేటలో 11, వనపర్తిలో 13, సూర్యాపేటలో 4, వరంగల్ రూరల్‌లో 6, జనగాంలో 5, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6, మహబూబాబాద్‌లో 1, సిద్ధిపేట 11, ఖమ్మం 2, నిర్మిల్ 7, రంగారెడ్డిలో 7 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.