రాష్ట్రీయం

తప్పుల చిట్టా రెఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 19: తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే దాన్ని దీటుగా ఎదుర్కోవడానికి టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై ఇప్పటికే టీటీడీ జియ్య ర్లు, ఆలయ నూతన ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వారి బృందం చేత మీడియాకు వివరణ ఇప్పించారు. ముఖ్యంగా ఆలయంలో స్వామివారి కైంకర్యాలు సక్రమంగా జరగడంలేదని, స్వా మిని పస్తులు పెడుతున్నారని దీక్షితులు ఆరోపణలు చేసిన విషయం పాఠకులకు విదితమే. ఈక్రమంలో శ్రీవారికి జరిగే కైంకర్యాలు ఆగమోక్తంగా సాగుతున్నాయని ఇందులో ఏ పొరబాట్లు జరగడంలేదని టీటీడీ జీయ్యర్లు చేత విస్పష్టమైన ప్రకటన ఇప్పించారు. ఇక ఆగమ సలహాదారుల సలహా తీసుకోకుండా పురాతన ఆలయంలో స్వామివారి ప్రసాదాలు తయారు చేసే పాకశాల (పోటు) మరమ్మతులపైన రమణ దీక్షితులు విమర్శలు చేశారు. పురాతన ఆలయాల్లో మరమ్మతులు చేపట్టాలంటే కేంద్ర పురావస్తుశాఖ అనుమతులు తప్పనిసరి. ఇదే విషయాన్ని రమణ దీక్షితులు చెన్నయ్‌లో విలేఖరుల సమావేశంలోప్రస్తావించారు. ఈ అంశంపై స మాధానం చెప్పడం టీటీడీ అధికారులకు కొంత స మస్యగా మారే అవకాశం లేకపోలేదు. స్వామివారి విలువైన పింక్ డైమండ్ విదేశాల్లో రూ.500 కోట్లకు విక్రయించినట్లుగా పత్రికల్లో వచ్చిందని, ఇది గరు డ సేవలో స్వా మివారికి అలంకరించిన సందర్భం గా భక్తులు విసిరిన నాణేల దెబ్బకు చిన్నాభిన్నం అ యినట్లు రికార్డుల్లో నమోదు చేసినట్లు రమణ దీక్షితులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆ ధారాలను టీటీడీ అధికారులు సిద్ధం చేసి ఉంచా రు. అర్చకులకు జీవితంలో శక్తి ఉన్నంత వరకు స్వామివారికి కైంకర్యా లు చేసే హక్కు ఉంటుందని దీక్షితులు వాదిస్తున్న విషయం విదితమే.
టీటీడీ చేతిలో ఆధారాలు?
పింక్ డైమండ్ అర్చకుల ఆధీనంలో ఉంచిన విషయంపై కూడా ఆధారాలు సేకరించినుట్లు సమాచారం. శ్రీవారి ఆలయంలోస్వామివారి ప్రసాదాల తయారీకి సంబంధించి రమణ దీక్షితులు ఒక పుస్తకాన్ని రూపొందించి దీని గురించి టీటీడీ అధికారులకు నామ మాత్రంగా కూడా చెప్పకుండా విఫణిలో విక్రయాలకు ఉంచడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. ఇలా రమణ దీక్షితుల తప్పుల చిట్టాను టీటీడీ అధికారులు సేకరించారు. అవసరమైతే ఈ విషయాలను మీడియా ముందు ఉంచడానికి యో చన చేస్తున్నారు. తాను చెన్నైలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆలయంలో జరిగిన పొరబాట్లను వివరించడానికి కారణం తిరుమలలోని పాత్రికేయులు అధికారుల చెప్పుచేతుల్లో ఉన్నారని ఒక చానల్లో ఆరోపించా రు. ఈ అంశంపైన తిరుమలలోని పాత్రికేయుల్లో కూడా అసహనం వ్యక్తం అవుతోంది. ఏదేమైనా టీటీడీ వర్సస్ దీక్షితులు మధ్య ఇప్పటి వరకు సాగుతున్న అంతర్యుద్ధం నేడు బహిరంగమైంది. ఈ విషయంలో టీటీడీ తనకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటోం ది. మొత్తం మీద దీక్షితుల కారణంగా ఏర్పడిన తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పడిన వివాదాల ను వెలుగులోకి తీసుకురావాలనే పట్ట్టుదలతో అధికారులు ఉన్నారు. అయి తే అధికారులు ఈ వివాదాలను ఇప్పుడు బహిర్గతం చేస్తే ఇన్ని సాక్షాధారాలున్నప్పుడు చర్యలు తీసుకోవడంలో అధికార యం త్రాంగం ఎందుకు వైఫల్యం చెందారనే ప్రశ్న ఉద్భవిస్తుంది. అదే జరిగితే అధికారులు కూడా దోషులు కావడం ఖా యం. ఇదిలావుండగా రమణ దీక్షితు లు ఇంకా ఎలాంటి అంశాలను బహిర్గతం చేయనున్నారు. అధికారులపై ఎలాంటి ఆరోపణలు చేస్తారోనన్న చర్చ టీటీడీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొత్తం మీద టీటీడీ, రమణ దీక్షితుల మధ్య సాగుతున్న ధార్మిక సమరం వైకుంఠపాళీని తలపిస్తోంది. ఇం దులో ఎవరు దోషులు అవుతారో, ఎవరు చెప్పి న మాటలు వాస్తవం అవుతాయో మరో రెండు, మూడు రోజుల్లో తేలే అవకాశం ఉంది.

ఢిల్లీకి రమణ దీక్షితులు..

టీటీడీ ఇచ్చిన ఉద్యోగ విరమ ణ ధ్రువపత్రాన్ని రమణ దీక్షితులు వ్యక్తిగతంగా ఇంత వరకు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధానిని, రాష్టప్రతిని కలవడానికి వెళ్లారా లేక టీటీడీ ఇచ్చిన ఉద్యోగ విరమణకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వెళ్లారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఉన్న రమణ దీక్షితులు కదలికలపై కూడా టీటీడీ అధికారులు దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఆయన ప్రధానికి, రాష్టప్రతికి టీటీడీ అధికారులుపైన, ఆలయంలో స్వామివారి కైంకర్యాల్లో పొరబాట్లు జరుగుతున్నాయని ఫిర్యా దు చేస్తే ఎలా సమాధానం చెప్పాలన్నదానిపై అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా దీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు ఆలయ అర్చకులుగా పనిచేసిన సమయంలో జరిగిన పొరబాట్లపై అధారాలు సేకరిస్తున్నారు.
ఇందులో భాగంగా 2002లో ఓ భక్తుడు రూ.5లక్షలు స్వామివారికి విరాళం ఇస్తే అందులో రూ.3లక్షలు మాత్రమే టీటీడీకి అందజేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను టీటీడీ అధికారులు సిద్ధం చేశారు. 2007లో టీటీడీ అనుమతి లేకుండా మహారాష్టల్రో యజ్ఞాలు చేశారని ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు భావిస్తున్నా రు.