రాష్ట్రీయం

పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. ప్రచండ భానుడి ప్రతాపం రోజు రోజుకీ పెరగడంతో వేసవి తాపం వచ్చేసిందని జనం గగ్గోలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శనివారం పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురంలో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నందిగామలో నమోదైంది. ఇటు తెలంగాణలో కూడా అత్యధికంగా రామగుండం, ఆదిలాబాద్, భద్రాచలం, మెదక్, నిజామాబాద్‌లో 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైతే, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 21 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు బాగానే పెరిగినట్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కర్నూల్లో 39 డిగ్రీల సెల్సియస్, జంగమేశ్వరపురంలో 38 డిగ్రీల సెల్సియస్, ఆరోగ్యవరం, కడప, విజయవాడల్లో 37 డిగ్రీల సెల్సియస్, విశాఖ పట్నం, కాకినాడ, నెల్లూరు, తుని, విశాఖపట్నంలో 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో హన్మకొండ, మహబూబ్‌నగర్‌లో 39 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్ 38 డిగ్రీల సెల్సియస్, హకీంపేట్, ఖమ్మం, నల్గొండల్లో 37 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే దాదాపు ఐదారు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.
నిజాం కాలంనాటి ఫిరంగి లభ్యం
పురావస్తు శాఖకు అప్పగింత
హైదరాబాద్, మార్చి 12: పాతబస్తీలో రోడ్డు విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాల్లో చారిత్రక సంపద ఒకటి బయటపడింది. చార్మినార్ పరిధిలోని హుస్సేని ఆలం-కోకాకి తట్టి ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు విస్తరణ కోసం ఓ పురాతన భవనాన్ని కూల్చి శిథిలాలు తొలగిస్తుండగా నిజాం కాలంనాటి ఫిరంగి బయటపడింది. వెంటనే స్థానికులు చార్మినార్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పురాతన ఫిరంగిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారు దానిని పురావస్తు శాఖకు అప్పగించారు. ఈ పురాతన ఫిరంగిని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో
1.8 కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్, మార్చి 12: శంషాబాద్ వినానాశ్రయంలో శనివారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ ప్రయాణికుడి నుంచి 1.8 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఆ ప్రయాణికుడి బ్యాగ్‌ను సోదా చేయగా ఒక కిలో 800 గ్రాముల బంగారం పట్టుబడింది. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం సైబరాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
కృష్ణా పుష్కరాలకు 134 కోట్లు
హైదరాబాద్, మార్చి 12:కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం134 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ల భవనాల శాఖ ఆధ్వర్యంలో పుష్కరాల కోసం రోడ్ల నిర్మాణం కోసం ఈ నిధులు విడుదల చేశారు.