రేపటి గురించి ఆలోచించను -- రవితేజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ రాజాగా తెలుగు ప్రేక్షకులచే క్రేజ్ తెచ్చుకున్న రవితేజ సినిమా అంటే ఒక్క మాస్‌కే కాదు.. అటు క్లాస్ ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇష్టం. అందుకే ఆయనకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఆయన సినిమాలంటే పిల్లలు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. రవితేజ తాజాగా ‘నేల టిక్కెట్టు’తో మరో విజయం కోసం సిద్ధం అయ్యాడు. కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో రవితేజతో ఇంటర్వ్యూ..
* ఇంతకీ ‘నేల టిక్కెట్టు’ అంటే?
- నేల టికెట్‌లో సినిమాలు చూసిన అనుభవం అందరికీ ఉండొచ్చు.. అయితే నేటి జనరేషన్‌కు ఈ విషయం తెలియదు. అప్పట్లో మా నాన్నమ్మగారి ఊరిలో టూరింగ్ టాకీస్‌లో నేల టికెట్‌లో ఎన్నో సినిమాలు చూశాను. ఆ ఫీలింగే వేరు. నేల టికెట్ అంటే సినిమాలో హీరో తన చుట్టూ నలుగురు ఉండాలని కోరుకునే వ్యక్తి కథే ఇది.
* మీ పాత్ర గురించి?
- ఇందులో నేను ఓ అనాథను. ప్రతి మనిషిలోను ఏదో ఒక బంధాన్ని వెతుక్కునే మనిషిలా కనిపిస్తాను. ఎప్పుడూ జనాలమధ్యలో ఉండాలనేది సినిమాలో నా ఫిలాసఫీ. చాలా కొత్తగా ఉంటుంది.
* మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటి?
- ఇందులో ముసలి వాళ్లయిన తల్లిదండ్రులను ఎవరూ పట్టించుకోకుండా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంచేవాళ్ళంటే నాకు అసహ్యం. అలాంటివాళ్ళు బ్రతికి ఉన్నా కూడా వేస్ట్. అలాంటి పెద్దవాళ్ల గురించి చెప్పడం జరిగింది. పెద్దవాళ్లంటే చేతకానీ వాళ్ళు కాదు, నిలువెత్తు అనుభవం అనే డైలాగ్ కూడా ఉంది. ఆ పాయింట్ నన్ను బాగా టచ్ చేసింది.
* పవన్‌కళ్యాణ్‌తో మీ రిలేషన్?
- ఆయన చాలా సరదాగా ఉంటారు. నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడు కలిసినా బాగా మాట్లాడుతారు. ఇద్దరం కలిశామంటే నవ్వులే నవ్వులు.
* దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గురించి?
- కళ్యాణ్‌కృష్ణ చాలా మంచి దర్శకుడు. అతని సినిమాల్లో క్లాస్, మాస్ టచ్ రెండూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అంతే. ఆయన తరహా ట్రీట్‌మెంట్ కనిపిస్తుంది. ఈ కథను నాకు మూడేళ్ల కిందటే చెప్పాడు. కానీ నాకున్న వేరే కమిట్‌మెంట్స్‌వల్ల అప్పుడు కుదరలేదు. దాంతో వేరే సినిమా చేసుకో, తరువాత చేద్దామని చెప్పాను. అలా తాను సోగ్గాడే చిన్నినాయనా సినిమా చేశాడు.
* వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు, కారణం?
- దానికి ప్రత్యేకంగా కారణాలు లేవు. అప్పడంటే కుదరలేదు. ఇప్పుడు అన్నీ కుదిరి వరుసగా సినిమాలు చేస్తున్నాను.
* మీ సినిమా నుండి అను ఇమ్మాన్యుయేల్ ఎందుకు తప్పుకుంది?
- ఆమె మా సినిమాతోపాటు శైలజారెడ్డి అల్లుడు అనే సినిమా కూడా చేస్తోంది. మా సినిమాకి ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉండటం వలన ఆ సినిమాకు ఇబ్బంది కలుగుతుందని ఆమె తప్పుకున్నారు. తప్పకుండా ఆమెతో ఒక సినిమా చేస్తాను.
* మీ అబ్బాయి మీ సినిమాల్లోనే నటిస్తాడా?
- తప్పకుండా బయటి సినిమాలు కూడా చేస్తాడు. అసలు ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలోనే చేయాల్సి వుంది కానీ ఎగ్జామ్స్ ఉండటంవల్ల చేయలేకపోయాడు. వేరే అవకాశాలు వస్తే చేస్తాడు.
* నిర్మాత రామ్ గురించి, ఆయనతో మరో సినిమా చేస్తున్నారుగా?
- రామ్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ నిజాయితీగా, పాజిటివ్‌గా ఉంటారు. ఆయనతో ఒక సినిమా కాదు ఇంకా ఇంకా సినిమాలు చేయాలని ఉంది. తాను డబ్బులు సంపాదించాలని ఇక్కడికి రాలేదు. మంచి పాషన్‌తో వచ్చారు.
* నేల టిక్కెట్టు అంటే మరి క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?
- ఖచ్చితంగా. మా సినిమా నేల టికెట్ వాళ్లనే కాకుండా బాల్కనీ వాళ్ల చేత కూడా విజిల్ వేయిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే సినిమా. అందరూ రేపు థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.
* రీమేక్ సినిమా చేయడానికి కారణం?
- కొత్త కారణం అంటూ ఏమీ లేదు. కథ నచ్చింది, అందుకే చేస్తున్నాను.
* కొత్త కమిట్‌మెంట్స్ గురించి?
- ప్రస్తుతం శ్రీనువైట్ల అమర్ అక్బర్ ఆంటోని సినిమా, అలాగే తమిళ రీమేక్ చేస్తున్నాను. కొత్త కమిట్‌మెంట్స్ కూడా ఉన్నాయి. నేను రేపటి గురించి ఆలోచించను. ఈ రోజు ఏమిటన్నదే నా ఆలోచన.

--శ్రీ