ప్రతిభను నిరూపించుకునే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాస్టింగ్ డైరక్టర్ సత్యానంద్

వి.ఆర్.్ఫలిమ్స్ నిర్వహిస్తున్న షార్ట్ఫిలిమ్ కాంటెస్ట్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ సత్యానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వి.ఆర్. ఫిలిమ్స్, వినయ్ చేస్తున్న ఈ కాంటెస్ట్ ఎంతోమంది కొత్తవారికి చాలా ఉపయోగకరమైనదన్నారు. తన దగ్గర శిక్షణపొంది మంచి పొజిషన్‌లో ఉన్నవారున్నారని, అలాగే కొత్తవారికి తమ ప్రతిభ నిరూపించుకోవాలంటే ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ అవసరమని అన్నారు. ఈ ప్రయత్నం చేస్తున్న వి.ఆర్ ఫిలిమ్స్ సంస్థను అభినందిస్తున్నానని అన్నారు. వినయ్ మాట్లాడుతూ, షార్ట్ఫిలిమ్ కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకునే వారు ఆన్‌లైన్‌లో మా వెబ్‌సైట్‌లోకి రిజిస్టర్ అవ్వాలనానరు. ఉత్తమ షార్ట్ఫిలిమ్‌కు 1,11,111 రూపాయలు, రెండవ బహుమతిగా 22,222 రూపాయలు, మూడవ ఉత్తమ షార్ట్ఫిలిమ్‌కు 11,111 రూపాయలు అందిస్తాము. ఈ కార్యక్రమం జూన్ 10న జరుగుతుంది అని అన్నారు.