రాష్ట్రీయం

భాషా పండితుల ఫలితాలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణలో భాషా పండితుల కోర్సులో చేరేందుకు నిర్వహించిన ఎల్పీసెట్ ఫలితాలను ప్రకటించారు. తెలుగు పండిట్ ట్రైనింగ్ కోర్సు ప్రవేశపరీక్ష టాపర్‌గా గోపాలదాసు మధు (77 మార్కులు) నిలవగా, ఉర్దూ పండిట్ ట్రైనింగ్ కోర్సు టాపర్‌గా 73 మార్కులతో దుర్దానా బేగం నిలిచింది. హిందీ పండిట్ ట్రైనింగ్ కోర్సులో ఉప్పలపల్లి నరేందర్ 78 మార్కులతో టాపర్‌గా నిలిచారు. తొలి సారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు తెలుగు పండిట్ విభాగంలో 2429 మంది దరఖాస్తు చేయగా, 1989 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 1743 మంది అర్హత సాధించారు. ఇక ఉర్దూ మీడియంలో 63 మంది రిజిస్టర్ చేసుకోగా, 54 మంది హాజరయ్యారు. 37 మంది అర్హత సాధించారు. హిందీ పండిట్‌లో 1753 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 1478 మంది హాజరయ్యారు. 927 మంది క్వాలిఫై అయ్యారు.