ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మార్పీలను నియంత్రించే చట్టం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: ఎమ్మార్పీని నియంత్రించే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. నాణ్యమైన ఆహారం అందేలా ఫుడ్ కంట్రోల్ బోర్డును పౌరసరఫరాల శాఖ క్వాలిటీ కంట్రోల్ కిందకు తీసుకొస్తున్నామన్నారు. ప్రతిభ కనబర్చే వినియోగదారుల రక్షణ మండలి సభ్యులకు వచ్చే డిసెంబర్‌లో అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా తన హయాంలో వినియోగదారుల రక్షణ మండలి సమావేశం జరిగినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 13 జిల్లాలకు చెందిన సభ్యులతో 10 శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా సమావేశం దృష్టికి పలు విషయాలు తీసుకొచ్చారన్నారు. వినియోగదారులకు రక్షణ కల్పించాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. తమకు గుర్తింపు కార్డులివ్వాలని వారు కోరారన్నారు. ప్రతి జిల్లాలోనూ వినియోగదారుల రక్షణ మండలికి ఒక అధికారిని నియమించాలని కోరారు. కన్జ్యూమర్ ఫోరాలు ఇచ్చిన తీర్పుల అమలుకోసం హెడ్ కానిస్టేబుల్‌ను వినియోగించాలని సభ్యులు కోరారన్నారు. ముఖ్యంగా జిల్లాకో ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూమి కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వమే రూ.50 లక్షల వ్యయంతో ల్యాబ్ నిర్మిస్తుందన్నారు. ల్యాబ్‌ల ఏర్పాటుతో సరుకుల నాణ్యతపై తక్షణమే పరీక్షలు నిర్వహించడానికి వీలు కలుగుతుందన్నారు. కార్పొరేట్ కళాశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలనే నిబంధన ఉందని, దాని అమలుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. మీ సేవా కేంద్రాల్లో అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారని సర్ట్ఫికెట్లు కూడా సకాలంలో అందజేయడం లేదని సభ్యులు ఫిర్యాదు చేశారని మంత్రి పుల్లారావు తెలిపారు.