క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లర్ కత్తితో దాడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 23: ఎర్రచందనం స్మగ్లర్‌లకు రోజురోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. దట్టమైన అడవుల్లో సంచరిస్తున్న స్మగ్లర్ల కదలికల గుట్టు రట్టు చేయడంలో టాస్క్ఫోర్స్‌కు చెందిన బిట్టు వారి పాలిట సింహ స్వప్నంలా మారుతోంది. ఇప్పటికే పలువురు స్మగ్లర్లను దట్టమైన పొదల్లో దాచివుంచుతున్న ఎర్రచందనాన్ని గుర్తించడంలో బిట్టు తిరుగులేని ప్రతిభను కనబరుస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి శ్రీనివాసమంగాపురం సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ వద్ద పొదల్లో దాచివుంచిన ఎర్రచందనం దుంగలను బిట్టు గుర్తించింది. కూంబింగ్ చేస్తున్న ఆర్‌ఐ భాస్కర్ బృందంపై పొదల్లో దాక్కుని కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించిన తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి అనే స్మగ్లర్ ఆటకట్టించింది. టాస్క్ఫోర్స్ ఆర్‌ఐ భాస్కర్ బృందం శుక్రవారం రాత్రి ఐజీ కాంతారావు ఆదేశాలతో చీకటీగల కోన, సచ్చినోడిబండ, ఈతగుంట ప్రాంతాల్లో నాలుగు బృందాలుగా విడిపోయి కూంబింగ్ చేపట్టారు. ఎర్రగుట్ట అటవీప్రాంతంలో గుంపులుగా స్మగ్లర్లు వెళ్లినట్లు వారి పాదముద్రలను గుర్తించారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది దానిని ఆనుసరించారు. రోడ్డు వద్ద పాదముద్రల జాడ కనిపించలేదు. అప్పుడే స్మగ్లర్లు నడిచి వెళ్లినట్లు అనుమానించిన సిబ్బంది ఐదు కిలోమీటర్లు మేర పరుగులు తీశారు. నేపథ్యంలో స్మగ్లర్ల జాడ కనిపించకపోవడంతో ఆర్‌ఐ భాస్కర్ ఈ విషయాన్ని ఎస్పీ రవిశంకర్‌కు తెలియజేశారు. ఆయన డాగ్ స్క్వాడ్‌ను, అదనపు బలగాలను పంపించి కొల్లేటి వంకను జల్లెడపట్టారు. స్మగ్లర్లు తప్పించుకుని పారిపోకుండా చంద్రగిరి, ముక్కేటి వద్ద సర్వేలెన్స్ ఏర్పాటు చేసి, చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. ఇదిలావుండగా ఇక అటవీప్రాంతంలోకి వెళ్లిన డాగ్ స్క్వాడ్ బిట్టు ముందుగా 7 తబలా ఎర్రచందనం దుంగలను గుర్తించింది.
మరో దుంగను గుర్తించారు. డాగ్ స్క్వాడ్ బిట్టు ఒక పొద వద్ద ఆగి గట్టిగా అరవడం ప్రారంభించింది. అప్రమత్తమైన సిబ్బంది ఆ పొదల్లోకి చొరబడ్డారు. అక్కడ ఒదిగివున్న స్మగ్లర్ క్రిష్ణమూర్తి తన వద్ద ఉన్న కత్తితో సిబ్బందిపైకి దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇక బిట్టు క్రిష్ణమూర్తిని కదలనీయకుండా చేయడంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. తనది తమిళానాడు కృష్ణగిరి అని, తనతోపాటు 8మంది వచ్చారని, అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలకు తనను కాపాలా ఉంచి అడవిలోకి వెళ్లారని తెలిపాడు. అధికారులు కూంబింగ్ ముమ్మరం చేశారు. శుక్రవారం రాత్రి పట్టుబడ్డ స్మగ్లర్, గుర్తించిన ఎర్రచందనం ప్రాంతంలో ఇప్పటికే 30 సార్లకుపైగా టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు చేసి ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ స్మగ్లర్లు అదే ప్రాంతాన్ని ఎంచుకుని అక్రమ రవాణాకు పాల్పడటంపై పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఆసరాగా చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం నాటి దాడుల్లో ఏసీఎఫ్ కిష్టయ్య, డిఎస్పీ హరినాధబాబు, ఎఫ్‌ఆర్వోలు ప్రసాద్, లక్ష్మీపతి పాల్గొన్నారు. మొత్తం మీద శేషాచల అడవుల్లో టాస్క్ఫోర్స్ నిర్వహిస్తున్న రెడ్‌హంట్‌లో బిట్టూ పాత్ర రోజురోజుకు కీలకంగా మారుతోంది. స్మగ్లర్లలో కూడా భయం నెలకొంటున్నట్లు సమాచారం.