రాష్ట్రీయం

తెలంగాణలో తొలి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, జూన్ 30: తెలంగాణ రాష్ట్రంలో తొలివెలుగులు విరజిమ్మాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంకురార్పణం జరిగిన మొదటి విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రూ.5,296 కోట్ల వ్యయంతో సుమారు 1000 ఎకరాల స్థలంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నూతనంగా నిర్మించిన కేటీపీఎస్ 7వ దశలో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు శనివారం రాత్రి 10గంటలకు స్విచ్ ఆన్ చేసి సింక్రనైజేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం బాయిలర్ పనులు విజయవంతం కావడంతో బాయిలర్‌ను.. టర్బైన్, జనరేటర్లకు అనుసంధానం చేసి సింక్రనైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియకు ముందు బాయిలర్ వద్ద బొగ్గును హెచ్‌ఎస్‌డీ ఆయిల్‌తో మండించి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. మొదటి రోజు సుమారు 50 మెగావాట్లు విద్యుదుత్పత్తి జరిగే విధంగా చూశారు. 2015 జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభించగా జూన్ నెల నుండి నిర్మాణ పనులను వేగవంతం చేసి 41నెలల్లో 7వ దశ కర్మాగారం పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో డైరెక్టర్లు సచ్చిదానందం, బీ లక్ష్మయ్య, రామయ్య, ఈడీ సివిల్ అజయ్, కేటీపీఎస్ సీఈలు జే సమ్మయ్య, టీఎస్‌ఎన్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.