Others

కన్నీళ్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుతో పెనవేసుకుని..
హృదయ సాగరం నుండి
అలల్లా ఎగిసిపడుతూ
కనుల గడపను తాకి..
మెలమెల్లగా బయటకు
వచ్చే కన్నీళ్లు..
వేదనకే కాదు
ప్రమోదానికీ ఆనవాళ్లు!
ఎంత గొప్పవి కన్నీళ్లు..
ఒక్క చుక్క వృథా కాదు
అవి జారిపడే ముందు..
కనీసం.. కళ్లను క్షాలితం చేస్తాయి!
ఎంచక్క
అవి చెక్కిళ్లపై
మృదువుగా చేసే సంతకాలు..
తామరాకుపై మెరిసే
నీటి బిందువులను తలపిస్తాయి!
అప్పుడప్పుడు
కనురెప్పల అంచున
కొలువుదీరుతూ..
చుక్కల్లా ప్రకాశిస్తాయి!
అంతరంగ భారాన్ని కొంతైనా
తమ నెత్తినెత్తుకుంటూ..
ఒకింత సాంత్వననిస్తాయి!
ఆకాశం
మబ్బులతో దట్టంగా కమ్ముకున్నప్పుడు
వర్షం కురిసినట్లు..
బాధలతో
గుండె బరువెక్కి నిండితే
గండిపడి
కన్నీళ్లు తన్నుకు వస్తాయి!
ఆడవాళ్ల కళ్లు
అందంగా ఉంటాయని కాబోలు
అవి అక్కడే తిష్టవేస్తాయి!!

- దాస్యం సేనాధిపతి 94405 25544