సబ్ ఫీచర్

సర్దుబాటు ఉండాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడైనా సర్దుబాటు తప్పనిసరి. అది ఉద్యోగంలోనైనా, ఇంట్లోనైనా, తల్లిదండ్రుల దగ్గర నుంచి జీవిత భాగస్వామి దాకా ఏదో ఒక విషయంలో సర్దుబాటు ఉంటేనే జీవన క్రమం మెల్లగా సాగుతుంది. లేకుంటే ప్రతిరోజు గొడవలు మొదలు. గొడవలు, కొట్లాట వల్ల మానసిక అశాంతి ఏర్పడుతుంది. దానితో లేనిపోనీ రోగాలు అంటుకుంటాయి. ఎదురు వాళ్లు ఏమనుకొంటారో అని ఒకటే ఆలోచనతో చేసే పనిపైన శ్రద్ధ తగ్గుతుంది. ఎదుటి వారు ఏం చేస్తారో దానికి తగినట్లు మనం ఏం చేయాలోనన్న ఆలోచన్లు తప్ప మన ప్రగతి కోసం మన మనుగడ సాగించడం కోసం ఏమి చేయాలో దాన్ని మర్చిపోతాం.
అందుకే ఎవరితో గొడవలు అక్కర్లేదు అనుకొంటే సర్దుబాటు తప్పనిసరి. ఎవరికి వారు పెద్ద జీనియస్ అనుకొంటారు. అన్నీ నాకే తెలుసు అనుకొంటే ఫర్వాలేదు. కాని ఎదుటివారికి ఏమీ తెలియదు అనుకొంటే చాలు వెంటనే ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెడదాం. అంతే అక్కడ నుంచి గొడవలు మొదలవుతాయి. అందుకే ఎవరి పనిలో వారే గ్రేట్. ఆ గ్రేట్‌నెస్ మరొకరు గుర్తించాలి అనుకోగూడదు. కావాల్సిన పని జరిగిందా లేదా తెలుసుకోవాలి. ఈరోజు నిద్ర లేచి అనుకొన్న పనులను పూర్తి చేసామా లేదా, లేకుంటే వాటిని ఎలా పూర్తి చేయాలో అనో లేక ఈ లోకంలో పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ పుడుతూనే ఉన్నారు.గిడుతూనే ఉన్నారు. కాని వారు వారు చేసిన మంచి పనుల వల్ల వారునేడు మన మధ్యలేకపోయినా సరే వారిని స్మరించుకుంటున్నాం. అట్లా మనం ఏదైనా మంచి పని నలుగురికి పనికి వచ్చేది చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి.
కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు తోటి ఉద్యోగస్తులు అంతకుముందు ఆ సంస్థలో పనిచేస్తున్నారు కనుక వారికి కొన్ని మెళుకువలు తెలిసి ఉండవచ్చు. పుస్తక జ్ఞానం మనకు ఉండవచ్చు. కాని వారికి అనుభవజ్ఞానం ఎక్కువ ఉండవచ్చు. కనుక వారితో గౌరవ పురస్సరంగా మాట్లాడుతూనే వారినుంచి పనిలో మెళుకువలు తెలుసుకోగలగాలి. ఆ మెళుకువలను వాటితో మనకున్న జ్ఞానాన్ని జత చేసి పనిని సమర్థవంతంగా చేయగలగాలి. అపుడు ఒక్క బాస్ నే కాదు తోటి ఉద్యోగస్తుల మెప్పుదల కూడా లభ్యమవుతుంది.
అట్లానే ఇంట్లో కూడా కొత్తగా పెళ్లైతే అత్తింటి వారి సంప్రదాయాలు అలవాట్లు ముందుగా అడిగి తెలుసుకొని వాటిల్లోని మంచి ని నేర్చుకుంటూనే మన సంప్రదాయాలు అలవాట్లు ఇవి అని, ఇవి ఎందుకు మంచివో వారికి తెలియజెబుతుండాలి. ఒకవేళ అలవాట్లు వేర్వేరుగా ఉంటే నెమ్మదిగా అలవాటును మాన్పుకోవడమో లేక కొత్త అలవాటు చేసుకోవడమో చేసుకోవాలి. జీవిత భాగస్వామికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తూనే వ్యక్తిగత దూషణలు చేసుకోకుండా ఎవరికి కోపం వచ్చినా పక్కవారు కాస్త సర్దుకుని కోపం తగ్గిన తరువాత ఒకవేళ వారు తప్పు చేసి ఉంటే వారికి తెలియ చెప్పాలి. ఒకవేళ మనమే తప్పు చేశామని అనుకొంటే పొరపాటుగా చేసానని నిజాయితీ ఒప్పుకోవాలి. తిరిగి ఆ తప్పు జరగకుండా చూసుకొంటానని వారికి చెప్పాలి. కేవలం చెప్పడమే కాక తిరిగి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. మనిషి ఎప్పుడూ ఒక్కరుగా జీవించలేడు. అది మహిళ యైనా పురుషుడైనా రెండవ వారు ఉంటేనే హాయిగా జీవిస్తారు కాని ఒకే ఒక్క మనిషి జీవించడం అనేది అసాధ్యం కనుక నలుగురితో కలసి మెలసి ఉండడం నేర్చుకోవాలి. సర్దుబాటు తత్వం ఏర్పరుచుకోవాలి. అపుడే అన్నింటిలోను విజయాలను చవి చూడవచ్చు.

-- లక్ష్మీ ప్రియాంక