రాష్ట్రీయం

పర్యాటకానికి చేయూతనివ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏజెన్సీ ఎమ్మెల్యేల అభ్యర్థన
గిరిజన సలహా సంఘానికి జగన్ డిమాండ్

హైదరాబాద్, మార్చి 17: విశాఖ డివిజన్‌లోని పాడేరు, అరుకు, పార్వతీపురం, సీతంపేట ప్రాంతాల్లో పర్యాటకానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజన ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు చెప్పారు. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి 2011 నుంచి ఐటిడిఏ ద్వారా కేటాయించిన నిధులు తెలియచేయాలని ఎమ్మెల్యేలు కళావతి, వెంకటరమణమూర్తి, రాజన్నదొర గురువారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అడిగిన ప్రశ్నపై సుదీర్ఘ చర్చ జరిగింది. 2010-13 మధ్య ఎటువంటి నిధులు కేటాయించలేదని పర్యాటక శాఖ మంత్రి తరపున మంత్రి అచ్చన్నాయుడు సమాధానం చెప్పారు. 13-14లో ఆరు కోట్లు, 14-15లో ఐదు కోట్లు, 15-16లో 5 కోట్ల రూపాయలను కేటాయించినట్టు ఆయన పేర్కొన్నారు. 2016-17లో ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియచేశారు. కళావతి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఏజెన్సీలో పర్యాటకానికి నిధులు కేటాయించకపోవడం శోచనీయమని అన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు. రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన సంప్రదాయాలతో కూడిన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. పర్యాటక రంగంలో గిరిజనులకు పెద్దగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదని అన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఏజెన్సీలో రిసార్ట్‌లను బినామీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.