రాష్ట్రీయం

రూ.1295 కోట్లతో ‘కల్వకుర్తి ఎత్తిపోతల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: వెనుకబడిన జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని సుమారు 3.65 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు రూ. 1295 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. తెలంగాణ శాసన మండలిలో గురువారం సభ్యుడు పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.
ప్రాజెక్ట్‌ను 2017 వరకు పూర్తిచేస్తామని అందుకోసం ప్రతి వారం ప్రభుత్వ ఉన్నాతాధికారులు ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై సమీక్షించడం జరుగుతుందన్నారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధర, కారాగారాల నుండి ఖైదీల విడుదల, అల్పసంఖ్యక వర్గాల కొరకు 15 సత్రాల కార్యక్రమం అమలు, రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహకాలు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఆన్‌లైన్ చెకింగ్ విధానంపై మండలిలో వచ్చిన ప్రశ్నలకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, హరీశ్‌రావు, మహమూద్ అలీలు జవాబిచ్చారు.