క్రైమ్/లీగల్

బల్దియా సఫాయి కార్మికుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూలై 27: బల్దియా సఫాయి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. సెప్టిక్ ట్యాంక్ కూలి ట్రాక్టర్‌తో సహా కార్మికుడు అందులో పడిపోయాడు. దశాబ్దకాలంగా డ్రైనేజీని శుభ్రం చేస్తూ జీవనం సాగిస్తున్న కార్మికుడు అందులోనే ప్రాణాలు కోల్పోవడంతో పారిశుద్ధ్య కార్మికులను తీవ్రం గా కలచివేసింది. నాలుగు గంటలపాటు శ్రమించి రెస్క్యూ టీమ్ సహాయంతో మృతదేహాన్ని బయటకు వెలికితీశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, హఫీజ్‌పేట, మాదాపూ ర్ కార్పొరేటర్లు, వీ.పూజిత, జగదీశ్వర్ గౌడ్‌లు, జోనల్ కమిషనర్ హరిచందన దాసరి, చందానగర్ సర్కిల్-21 ఉప కమిషనర్ టీ.వెంకన్న, మియాపూర్ ఏసీపీ సంక్రాంతి రవి కుమార్, పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు.
వివరాలలోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం రామన్నపేట గ్రామస్తుడైన గుడిశల వెంకటేష్ (43) పదేళ్ల క్రితం భార్యాబిడ్డలతో కలిసి బతుకుదెరువుకోసం నగరానికి వచ్చాడు. మియాపూర్ న్యూ కాలనీలో కిరాయి ఇంట్లో ఉంటున్న వెంకటేష్ చందానగర్ సర్కిల్ 21 పరిధిలో రాజరాజేశ్వరి శానిటరీ వర్కర్స్ పొదుపు సంఘంలో సభ్యునిగా దశాబ్దకాలంగా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ 5వ ఫేజ్‌లో రోడ్లపై పేరుకుపోయిన మట్టిని తొలగించి ట్రాక్టర్ ద్వారా కాలనీ చివరగా ఉన్న ఖాళీ స్థలంలో పోశారు. అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉందన్న విషయం తెలపకపోవడంతో కొంతకాలంగా మట్టినిపోస్తున్న ప్రదేశంలోనే తిరిగి మట్టినింపడంతో ఆ స్లాబ్ కుప్పకూలిపోగా ట్రాక్టర్‌తోపాటు పారిశుద్ధ్య కార్మికుడు వెంకటేష్ అందులో పడిపోయాడు. మరో కార్మికుడు సారయ్య తప్పించుకోగా డ్రైవర్ కుమారస్వామి గ్రహించి ట్రాక్టర్ దిగిపోయాడు. స్థానిక శానిటరీ రిసోర్స్ పర్సన్ మహేష్ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మియాపూర్ ఏసీపీ రవికుమార్ నేతృత్వంలో ఇన్స్‌పెక్టర్ చీమర్ల హరిశ్చంద్రా రెడ్డి, చందానగర్ ఇన్‌స్పెక్టర్ యన్.తిరుపతి రావు, ఎస్‌ఐలు, సిబ్బంది చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రెస్క్యూ టీమ్‌ను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. సెప్టిక్ ట్యాంక్ పెద్దది కావడంతో అం దులో ఉన్నదం తా యంత్రం ద్వారా బయటకులాగి నాలుగు గుంటలపా టు శ్రమించిన తర్వాత మృతదేహం బయటపడింది. డిప్యూటీ కమిషనర్ వెంకన్నతో పాటు ఏఎంఓహెచ్ డాక్టర్ కేఎస్ రవి, శానిటరీ సూపర్‌వైజర్ శ్రీనివాస్, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు సర్కిల్ 21 అధికార యం త్రాంగం, సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. మృ తుని భార్య ఉమ ఓ ప్రైవే ట్ సంస్థలో హౌస్‌కీపింగ్ కార్మికురాలిగా పనిచేస్తుండగా కొడుకు శ్రీకాంత్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నా రు. సెప్టిక్ ట్యాంక్ వద్ద కనీసం బోర్డు ఏర్పాటు చేసి ఉంటే ప్రమాదం జరిగేదికాదని, సంక్షేమ సంఘం నాయకు లు హెచ్చరించి ఉన్నా మట్టిని అక్కడ పోసేవారు కారని, నిర్లక్ష్యంతో తోటి కార్మికుడిని కోల్పోయామని పారిశు ద్ధ్య కార్మికులు కన్నీటిపర్యంతమయ్యా రు. జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం తగిన నష్టపరిహారం ఇస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పారు.