సూపర్‌కాప్‌గా రామ్ చరణ్?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 19 August 2018
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ జోరుగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాపై మెగా ఫాన్స్ ఆసక్తి ఎక్కువైంది. దానికి కారణం ఏమిటంటే.. ఈ సినిమాలో రామ్‌చరణ్ పవర్ఫుల్ పోలీసు అధికారిగా ఇదివరకే జంజీర్ అనే సినిమాలో చేసిన విషయం తెలిసిందే. మరోసారి ఆయన కాప్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, బోయపాటి స్టయల్లో యాక్షన్‌తో అదరగొడతాడని అంటున్నారు. చరణ్ సరసన ఖైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారట.