ఆంధ్రప్రదేశ్‌

మానవ అక్రమ రవాణా నిరోధంలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కీలకం: డీజీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 21: మానవ అక్రమ రవాణా నిరోధంలో స్వచ్చంద సంస్ధల భాగస్వామ్యంతో సత్ఫలితాలు సాధించవచ్చని డీజీపీ ఆర్‌పి ఠాకూర్ అన్నారు. ఇందుకోసం పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోందని, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీ పోలీసు, ప్రజ్వల స్వచ్చంద సంస్ధ సంయుక్తంగా రూపొందించిన ‘బాధితులకు న్యాయం జరిగే దిశగా పోలీసు దర్యాప్తు శిక్షణా మాన్యువల్ (ట్రైనింగ్ మాన్యువల్ ఫర్ పోలీసు ఆన్ విక్టిమ్ సెంటర్డ్ ఇన్విస్టిగేషన్) బుక్, మొబైల్ యాప్, పోలీసు ట్రైనింగ్ వెబ్‌సైట్‌ను మంగళవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులతోపాటు స్వచ్ఛంద సంస్ధల భాగస్వామ్యం మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. బాధితులను ఆదుకునేలా పోలీసు దర్యాప్తుకు సంబంధించి రూపొందించిన మ్యానువల్ ఎంతగానో ఉపయోపడుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజ్వల సంస్ధ ఫౌండర్ ప్రధాన కార్యదర్శి సునీత కృష్ణన్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా బారిన పడుతున్న బాధితులను దృష్టిలో ఉంచుకుని మాన్యువల్ రూపొందించినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం చేసేలా పోలీసు దర్యాప్తు ఉండాలనే కోణంలో ఐదు చాప్టర్లుగా మాన్యువల్ రూపొందించినట్లు వివరించారు. పోలీసు శిక్షణ సంస్ధ ఐజీ సంజయ్ మాట్లాడుతూ ఈ మాన్యువల్‌పై సెప్టెంబర్‌లో 40మంది పోలీసులకు అనంతపురం పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ ఇస్తామని చెప్పారు. మాన్యువల్‌తో పాటు వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాంతి భద్రతల అదనపు డీజీ హరీష్‌కుమార్ గుప్తా, సిఐడి అదనపు డీజీ అమిత్‌గార్గ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, ప్రజ్వల వాలంటీర్లు నూర్జాహాన్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.