ఆంధ్రప్రదేశ్‌

త్యాగానికి ప్రతీక బక్రీద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 21: త్యాగానికి ప్రతీకగా చరిత్రలో చిరస్థాయిగా బక్రీద్ పండుగ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. బుధవారం బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆధ్యాత్మిక, చారిత్ర పండుగ అన్నారు. మక్కా, మదీనా సందర్శన సందర్భంలో హజ్ యాత్ర పూర్తయిన మరుసటి రోజు బక్రీద్ వేడుకలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. మనిషిలో ప్రతికూల శక్తులు నశించి, సానుకూల దృక్పథం ఏర్పడేందుకు బక్రీద్ ఆధ్యాత్మిక సంపత్తిని అందించే పండుగగా మైనారిటీ సోదరులు భావిస్తారని వివరించారు. చరిత్రలో త్యాగానికి నిదర్శనంగా నిలిచిన ఇబ్రహీం జీవితాన్ని స్మరించుకుంటూ బక్రీద్ జరుపుకుంటున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల మధ్య సుహృద్భావం, సామరస్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మహమ్మద్ ప్రవక్త మానవత్వాన్ని ఉద్బోధించారని, మానవులంతా కలసిమెలసి జీవించాలని ప్రబోధించారని, రాష్ట్భ్రావృద్ధి కోసం ముస్లింలంతా ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మైనారిటీల సంక్షేమానికి 2018-19 బడ్జెట్‌లో 1101.9 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. చంద్రన్న పెళ్లికానుకగా అందిస్తున్న దుల్హన్ పథకం కింద ముస్లిం నవవధువులకు రూ 50 వేలు అందిస్తున్నామని 2018-19లో ఈ పథకానికి రూ 80 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. దీనివల్ల 16వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. చరిత్రలోనే తొలిసారిగా ఇమామ్‌లు, వౌజన్లకు పారితోషికం ప్రవేశపెట్టిన ఘనత తమదే అన్నారు.