Others
అమ్మంటే...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 August 2018
- దాస్యం సేనాధిపతి, 9440525544
అమ్మంటే...
కనిపించే దైవమే కాదు
ముగింపు లేని..
ఓ మహా కావ్యం!
ఊహలకందని మూర్తిమత్వం
వర్ణనకసలే దొరకని వ్యక్తిత్వం
అక్షరాల్లో బంధించలేని అనురాగం
వెనె్నలలాంటి ప్రసన్న వదనం
నవనీతం వంటి హృదయం
ఆమెకు శోభను కూర్చే ఆభరణాలు..
అమ్మ...
ఓ చల్లని జాబిల్లి
ప్రేమను పంచే కల్పవల్లి!
విసుగూ విరామం ఎరుగని
అవిశ్రాంత...
అమాయక శ్రమజీవి!
జన్మనిచ్చి...
జగతిలోని మర్మం తెలిపి
మనిషిగా తీర్చిదిద్దే అమ్మ...
తనయుల కుమ్ములాటల్లో..
నేడు మబ్బులు కమ్మిన
ఆకాశమైంది!
జీవన సంధ్యలో..
తన వారి ఆదరణ కరువై..
వృద్ధాశ్రమంలో..
బొమ్మై కూర్చుంది!
కవిత్వంలో మాత్రం
కదలాడే దేవతగా..
ఆవిష్కరింపబడుతోంది!