ఆంధ్రప్రదేశ్‌

తాత్కాలిక సచివాలయ పనుల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తాత్కాలిక సచివాలయ పనుల ప్రారంభంలో తొలి ఆపరేటర్‌గా సేవలందించిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన సామ్రాట్ రౌత్(20) సోమవారం ఉదయం 6గంటల సమయంలో ఓ మిషన్ కింద పడి దుర్మరణం చెందాడు. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు 45.12 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి కేటాయించిన పనుల్లో అధికశాతం నిర్మాణాలను ఇతర కంపెనీలు చేపట్టాయి. అందులో భాగంగా విశాఖపట్నానికి చెందిన సాయి కన్‌స్ట్రక్షన్ అధినేత సత్యనారాయణ పర్యవేక్షణలో కార్మికులు పనులు చేస్తున్నారు. ఆపరేటర్‌గా సామ్రాట్ సచివాలయ నిర్మాణ పనుల్లో భాగంగా సోమవారం పిల్లర్లు వేసేందుకు అవసరమైన గుంటలు తీసే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే గుంట తీసే ప్రాంతం కొంత బురదమయంగా మారటంతో రిగ్గింగ్ మిషన్ క్రమేణా ఒరిగిపోయింది. దీంతో మిషన్ కూలిపోతుందని గుర్తించిన సామ్రాట్ దూకేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆలస్యం జరగటంతో సామ్రాట్ మిషన్ కింద పడిపోయాడు. ఆర్డీవో భాస్కరనాయుడు మాట్లాడుతూ అంత్యక్రియలకు అవసరమైన రూ.50వేలు అతని తల్లికి అందజేస్తామన్నారు. అనంతరం కార్మిక చట్టప్రకారం నష్టపరిహారంగా రూ.8.90లక్షల చెక్కు త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా కార్మికుడు సామ్రాట్ మృతి చెందిన సమాచారాన్ని అందుకున్న వైస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకుని సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మృతుని కుటుంబానికి 10లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ద్వారా కూడా నష్టపరిహారం ఇప్పించాలని ఆయన కోరారు.

మండుతున్న‘సీమ’
నలభై దాటిపోయన ఉషోణ్రగతలు

ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం/కర్నూలు, మార్చి 21: రాయలసీమలో భానుడు భగభగలు ఏ మాత్రం తగ్గలేదు. సీమలోని నాలుగు జిల్లాల్లోనూ రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం అనంతపురం నగరంలో 42.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లాలో అత్యధికంగా శింగనమల మండలం తరిమెల గ్రామంలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక కర్నూలు నగరంలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లాలో అత్యధికంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో45.3 డిగ్రీలు, బేతంచెర్లలో45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కడప నగరంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లాలో అత్యధికంగా చిట్వేలులో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సెల్సియస్, జమ్మలమడుగులో45.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కడప జిల్లా లోని ఒక్క వీరబల్లి మండలంలోనే 39.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగిలిన అన్ని మండలాల్లోనూ 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఇక చిత్తూరు జిల్లాలోని 21 మండలాల్లో 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ నెల 26వ తేదీ వరకూ ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఉదయం ఎనిమిది గంటల నుంచే విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. రాత్రి సమయాల్లో సైతం వేడి తగ్గటం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఇదే సమయంలో రాయలసీమ జిల్లాల్లో సగటున 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వేసవి కాలం అత్యధిక ఉష్ణోగ్రత సగటున 45 డిగ్రీలుగా ఉంది. కాగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి ఏప్రిల్ చివరకు, మే తొలి వారంలో సుమారు 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది మే మూడు, నాలుగు వారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జూన్ తొలి వారంలోనే వర్షాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో రాయలసీమ జిల్లాల్లో సగటున 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎండలు మండుతుండటంపై ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి ఏప్రిల్ చివర, మే తొలి వారంలో సుమారు 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రాయలసీమ జిల్లాల్లో వేసవి కాలం అత్యధిక ఉష్ణోగ్రత సగటున 45 డిగ్రీలుగా రికార్డుల్లో ఉందని వారు పేర్కొంటున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల ఫలితంగా మార్చి నెలలోనే వేసవి తీవ్రత కనిపిస్తోందని ఈ ఏడాది మే మూడు, నాలుగు వారాల్లోనే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ముందుగానే వేసవి

విశాఖపట్నం, మార్చి 21: వేసవి ముందుగానే సాక్షాత్కరిస్తోంది. మార్చి నెల మధ్య నుంచే ఎండలు మండిపోతున్నాయి. వేసవి ప్రారంభానికి ముందే వేడిగాలులు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మధ్యాహ్న సమయానికే వేడిగాలులు కాస్తా వడగాలులను తలిపిస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా ఎండల తీవ్రతతో ప్రజానీకం ఆపసోపాలు పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే, ఈ ఏడాది వేసవి ముందే ఆరంభమైందనిపిస్తోంది. రాష్ట్రంలోని కోస్తా పరిధిలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి.ఈ సీజన్‌లో సాధారణంగా కనిపించే ద్రోణి ప్రభావం పెద్దగా లేకపోవడంతో పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులే ఎండలకు కారణంగా వాతావరణ శాఖ అంచనావేస్తోంది. వేసవి ప్రభావం కాస్త ముందుగానే కనిపిస్తోందని, దీనికి కారణం ఇదే సీజన్‌లో దక్షిణ భారతదేశాన్ని ఆనుకుని విదర్భ మీదుగా స్థిరంగా ఉండే అల్పపీడన ద్రోణి ప్రభావం పెద్దగా లేకపోవడమేనని అంచనావేస్తున్నారు. దీనికి తోడు గత కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు కూడా వాతావరంలో వేడిగాలులకు కారణంగా పేర్కొంటున్నారు.

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోలు మృతి
చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఘటన
భద్రాచలం, మార్చి 21: చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లోని కాసన్‌నూర్ దళం మహారాష్ట్ర సరిహద్దున ఉన్న కొట్టకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎట్టపల్లి అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారనే సమాచారంతో సి-60 బలగాలతో రెండు రాష్ట్రాల పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ పారిపోగా సంఘటనా స్థలంలో ఇద్దరు మహిళా మావోల మృతదేహాలతో పాటు ఆయుధాలు, నిత్యావసర సరుకులు, ఇతర సామగ్రి లభ్యమయ్యాయి. కాసన్‌నూర్ దళ ఉప కమాండర్ నిర్మల అలియాస్ సవిత, ఆరతిలుగా మృతులను గుర్తించారు. ఇదిలావుండగా ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. సోమవారం మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టేమరుపల్లి, సాలీం, మర్తనపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన వివిధ గ్రామాల నుంచి మావోల సానుభూతిపరులు 270 మంది పోలీసులకు లొంగిపోయారు.