ఆంధ్రప్రదేశ్‌

సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న సింహాచలం దేవస్థానం: స్వరూపానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సంప్రదాయాలకు అధికారులు తిలోదకాలిస్తున్నారని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ మండిపడ్డారు. ఆలయ సంప్రదాయాను పక్కనపెట్టి దేవాలయాలను రాజకీయ వేదికలుగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పీఠం ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ అప్పన్నస్వామికి ప్రతి యేటా సమర్పించే చందనం అరగతీతను ఏళ్లుగా ఇదే గ్రామానికి చెందిన లండ వంశీయుల ఆధ్వర్యంలో జరుగుతోందన్నారు. అయితే గత నాలుగేళ్లుగా స్వామి వారికి సమర్పించే చందనం అరగతీతను దేవస్థానం అర్చకులే నిర్వహించడం సంప్రదాయ విరుద్ధమన్నారు. దేవాలయ వ్యవస్థకు శాసన సమృద్ధి, సంప్రదాయాలే కీలకమన్నారు. వీటిని నిర్వీర్యం చేయడమంటే ఆలయ వ్యవస్థను కూల్చివేసినట్టేనన్నారు. భారతదేశంలో దేవాలయాల్లో కార్యక్రమాల నిర్వహణ 21 కులాలతో ముడిపడి ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవకు సిద్ధం చేసే ముందు దేవాలయ ద్వారాలను తెరిచేది ఇప్పటికీ యాదవ కులస్తులేనన్నారు. ఈ సంప్రదాయం అనాదిగా కొనసాగుతోందని వివరించారు. అయితే స్థానిక రాజకీయ జోక్యంతో దేవస్థానం అధికారులు ఒక వర్గానికి కొమ్ముకాసే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు. సింహాచలంలో అప్పన్న స్వామి నిజరూప దర్శనానంతరం సమర్పించే చందనాన్ని అరగతీసే కార్యక్రమం అనాదిగా స్థానిక లండ వంశీయులే నిర్వహిస్తున్నారన్నారు.