Others

ఆనంద జీవనానికి యోగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఉరుకుల, పరుగుల జీవితంలో కాలానికి పోటీపడుతూ, ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునేవరకు క్షణం తీరిక లేకుండా లక్ష్యం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో శారీరక అలసటకు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ ఒత్తిడి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు.. భారతదేశం పురుష ప్రధాన దేశం. సంఖ్యలో సగం, ఆకాశంలో సగం ఉన్నా, మన సమాజంలో స్ర్తీలకంటే పురుషులకే ప్రాధాన్యం ఎక్కువ. ఇక హక్కులు, అధికారాల విషయం అందరికీ తెలిసిందే.. ఒక మహిళ సాధారణంగా ఇంట్లో పనులన్నింటినీ చేసి భర్తను ఆఫీసుకి, పిల్లలను పాఠశాలలకి పంపించి తను ఆఫీసుకు వెళుతుంది. అక్కడ తను విధులను పూర్తిచేసుకుని ఇంటికి చేరుకుని తిరిగి ఇంటిపనుల్లో మునిగిపోతుంది. ఇలా మహిళ ఇంట్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించాలి. ఆఫీసులో ఎక్కడా ఎలాంటి లోటూ కనిపించకుండా సమర్థంగా పనిచేయగలగాలి. పిల్లలను చక్కగా చదివించాలి. వారికి సంబంధించిన అన్ని బాధ్యతల్ని ప్రేమగా, ఓర్పుగా నిర్వహించాలి. అధికపని, శారీరక అలసట వల్ల కలిగే చిరాకు, కోపం వంటి వాటిని వారు ఇతరులపై చూపించలేరు. వాటిని తమలోనే తొక్కి పెట్టడం వల్ల ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు నేటి మహిళలు. ఈ ఒత్తిడి వల్ల ఎన్నో రకాల సమస్యలు.. అలా కాకుండా మనలోని ఒత్తిడిని బయటకు పంపిస్తే ఇలాంటి అనారోగ్య సమస్యలేవీ దరిచేరవు. మరి ఒత్తిడిని బయటకు పంపించడమెలా? అని బుర్రలు బద్ధలు కొట్టుకోవాల్సిన పనిలేదు. ఒత్తిడిని చిత్తుచేసేందుకు యోగా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇటీవలి కాలంలో ఒత్తిడిని దరిచేరనివ్వకుండా యోగాను ఆశ్రయించే మహిళల సంఖ్య పెరుగుతోంది.
ఊబకాయం
ఊబకాయం నేటి మహిళల ప్రధానసమస్య. పెళ్లికాకముందు, పెళ్లి అయిన కొత్తలో ఎంతో అందంగా, కోమలంగా ఉండే అమ్మాయిలు ఇద్దరు పిల్లలు పుట్టగానే వారి రూపం మారిపోతుంది. చిన్నవయస్సులోనే వయసు మళ్లిన వారిలా కనిపిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి సూర్యనమస్కారాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని రోజుకి వంద నుండి రెండు వందల సార్లు చేయనవసరం లేదు. రోజుకి పది నుండి ఇరవై సార్లు చేస్తే సరిపోతుంది. సమయం లేనివారు ఉదయం పది, సాయంత్రం పదిగా విభజించుకుంటే సమయానుకూలంగా సరిపోతుంది. సూర్య నమస్కారాల వల్ల శరీరంలోని ప్రతి భాగమూ కదులుతుంది. ఫలితంగా శరీర భాగాల్లో పేరుకున్న కొవ్వు కరగడం మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో పవర్ యోగా అని ఒకటి వచ్చింది. అంటే యోగానే ఎక్సర్‌సైజ్‌లా చేస్తే దాన్ని పవర్ యోగా అంటున్నారు. ఇది చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ నడుము నొప్పి ఉన్నవారిని ఈ యోగా ఇబ్బంది పెడుతుంది. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి సూర్యనమస్కారాలతో పాటు నౌకాసనం, పాదహస్తాసనం, ఉత్థానుపాదాసనం, శ్రీలింగముద్ర, కపాలభాతి వంటి ఆసనాలు వేసుకోవచ్చు. వీటితో పాటు భస్ర్తికా ప్రాణాయామం కూడా చేస్తూ ఉండాలి.
గైనిక్ సమస్యలు
పీసీ ఓడీ, సిస్టులు, నీటి బుడగలు వంటి సమస్యల బారిన పడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సమస్య వచ్చిన తర్వాత తీసుకునే చికిత్స కన్నా సమస్య రాకుండా చూసుకోవడమే మంచిది. అందుకునే ప్రతినిత్యం సూర్యనమస్కారాలతో పాటు ఉష్టాసనం, భుజంగాసనం, ధనురాసనం, శుప్తగోరక్షాసనం, పక్షిక్రియ, పశ్చిమోత్తాసనం, హలాసనం, చక్రాసనం, సర్వాంగాసనం, నాడీ శోధన ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామాలు ఉపయోగపడతాయి.
థైరాయిడ్ పనితీరుకు..
ఈమధ్యకాలంలో బీపీ, మధుమేహంలతో పాటుగా థైరాయిడిజం కూడా బాగా పెరిగిపోయింది. కారణం అధిక ఒత్తిడి. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని అన్ని గ్రంథులకు మధ్య సంధానకర్తగా పనిచేస్తుంది. చాలామంది మహిళలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి పెరిగిపోయి థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా రుతుచక్రం దెబ్బతినడం, ఊబకాయం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి వల్ల కలిగే ఈ సమస్యలను యోగా ద్వారా తగ్గించుకోవచ్చు. విశుద్ధచక్రాసనం వేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. అలాగే ఈ ఆసనం పిట్యూటరీ, ఇతర గ్రంథుల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. దీనితోపాటు సూర్యనమస్కారాలు, విపరీతకర్ణి, నౌకాసనం, మత్య్సాసనం, భ్రమరీ ప్రాణాయామం, అంతర్ముఖ ముద్రలు వేయాలి. ఫలితంగా ఒత్తిడి దరిచేరనివ్వకుండా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.
వెన్ను సమస్యలు
ఉద్యోగరీత్యాకానీ, ఇంటి పనుల వల్ల కానీ మహిళలు ఎక్కువ సమయం కూర్చునే ఉంటారు. ఫలితంగా వెన్నుపాముపై ఒత్తిడి ఎక్కువ పడుతుంది. పైగా నేడు అన్నీ కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలే కావడంతో చిన్న వయస్సులోనే నడుము నొప్పి, మెడనొప్పి, స్పాండిలైటిస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వీటికి మేరుదండాసనాలు చక్కటి పరిష్కారం. అలాగే మార్జాలాసనం, భుజంగాసనాలు ఉత్తమమైనవి.
ఇలా యోగాను క్రమం తప్పకుండా చేయడం వల్ల మహిళలు తమ శరీరంలోకి ప్రవేశించనున్న వ్యాధులను ముందుగానే తరిమేయవచ్చు. ఒత్తిడి దరిచేరనివ్వకుండా యోగా నిపుణుల సలహాలు, సూచనలతో యోగాసనాల సాధన చేస్తూ అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జీవించవచ్చు.