మెయన్ ఫీచర్

కేరళలో పుంజుకుంటున్న భాజపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ ఓటర్లు 1977 నుంచి సరికొత్త పంథాను అనుసరించడం మొదలు పెట్టారు. వరుస ఎన్నికల్లో ఎప్పుడూ ఓకే పార్టీకి వారు అధికారాన్ని కట్టబెట్టడం లేదు. త్వరలో కేరళ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో లెప్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (సిపిఎం, సిపిఐ, జనతాదళ్ సెక్యులర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు) ప్రభుత్వం అధికారంలోకి వస్తుదని ఎవరైనా అంచనా వేయదలిస్తే అందుకు ఈ ఒక్క కారణం తప్ప మరేమీ కనిపించడం లేదు. అయితే ఇటువంటి మార్పు కేవలం రొటీన్‌గా జరిగేది మాత్రమే తప్ప ప్రభుత్వ పనితీరుపై వ్యక్తమయ్యే వ్యతిరేకత అని భావించడానికి వీల్లేదు. కేరళకు చెందిన సెంటర్ పర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సిఎస్‌డిఎస్) రాష్ట్రంలో జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలు వెలువరిస్తూ వచ్చింది. మరి ఆ సంస్థ రూపొందించిన ఏ నివేదికలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న అంశం ఎక్కడా కనిపించదు. అయిప్పటికీ అధికారంలో ఉన్న పార్టీ ఓటమి పాలుకావడం, ప్రతిపక్షపార్టీ గద్దెనెక్కడం వస్తూ ఉన్నది. నిజానికి కేరళలో విజయానికి పరాజయానికి మధ్య కేవలం కొద్ది తేడా మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇది కూడా ప్రజల్లో అధికార పార్టీ పట్ల ఎక్కువ వ్యతిరేకతను, విపక్షం పట్ల అధిక సానుకూలతను వ్యక్తం చేసే అంశం కాదు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను అట్లా ఉంచితే, స్థానిక సంస్థలకు ఇటీవల జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే, ఎల్‌డిఎఫ్ తిరిగి అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపించడం గమనార్హం. ప్రస్తుతం అధికారంలో ఉన్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, కేరళ కాంగ్రెస్-ఎం, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, జనతాదళ్ యునైటెడ్, కేరళ కాంగ్రెస్-జాకబ్ పార్టీల సంకీర్ణం), 2011 నుంచి అధిక స్థానాల్లో విజయం సాధిస్తూ వస్తున్నప్పటికీ, ఇటీవలి ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్నది. ఇది రాష్ట్ర ఓటర్ల అభిప్రాయంలో వస్తున్న తేడాను తెలియజేస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీని తిరస్కరించడానికి బహుశా స్థానిక సంస్థలు ప్రభావం చూపి ఉండవచ్చు. అయినప్పటికీ యుడిఎఫ్ ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి మాత్రం ఓటర్లపై ప్రభావం చూపిందనేది సత్యం. రానున్న ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ అవినీతిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నించి తీరుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎల్‌డిఎఫ్ ప్రచారం యుడిఎఫ్ అవకాశాలను మరింత దెబ్బతీస్తుంది.
ఇటీవలికాలం నుంచి యుడిఎఫ్‌కు రాష్ట్రంలో ప్రజల మద్దతు క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2011 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న 45.8 శాతం ప్రజల మద్దతు, 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి 42 శాతానికి పడిపోవడం దీన్ని స్పష్టం చేస్తున్నది. ఇంతగా క్షీణించినప్పటికీ ఎల్‌డిఎఫ్‌పై యుడిఎఫ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. యుడిఎఫ్‌కి క్షీణించిన బలాన్ని ఎల్‌డిఎఫ్ క్యాష్ చేసుకోలేకపోవడమే కాదు, తనకున్న ఓటు బ్యాంకును దారుణంగా కోల్పోవడమే విచిత్రం! ఏవిధంగా అంటే 2011లో ఎల్‌డిఎఫ్‌కు 44.9 శాతం ఉన్న ఓట్ల షేరు, 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి 40.1 శాతానికి దిగజారిపోయింది. అంటే 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండుశాతం లీడ్ కారణంగా యుడిఎఫ్ సంకీర్ణం 80 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిపత్యాన్ని సాధించగా, ఎల్‌డిఎఫ్ 56 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆధిపత్యాన్ని నమోదు చేసింది.
మరి ఎల్‌డిఎఫ్‌పై 2014 ఎన్నికల్లో యుడిఎఫ్ ఆధిపత్యం సాధించినప్పటికీ, మరి ఆ లీడ్ ఇంకా చెక్కుచెదరకుండా అట్లాగే ఉన్నదా? లేక క్షీణించిందా? లేక ప్రజాకర్షణలో ఎల్‌డిఎఫ్ కంటే యుడిఎఫ్ ఇంకా ముందంజలో కొనసాగుతున్నదా? అనేది చెప్పడం కష్టం. అయితే వీటికి సంబంధించిన ఏవిధమైన సూచనలైనా కనిపిస్తున్నాయా అంటే అవి కేవలం ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలు మాత్రమే. ఈ ఎన్నికల్లో యుడిఎఫ్ పొం దిన వరుస పరాజయాలు ఆ పార్టీకి ప్రజల్లో పలుకుబడి మరింత క్షీణించిందన్న సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న తరుణంలో ఈ స్థానిక ఫలితాలు ప్రజల అభిప్రాయానికి భావి సూచనగాభావించవచ్చు.
సరే ఇప్పుడు మరో అంశానికి వద్దాం. కేరళలో మరోస్పష్టమైన పరిణామాన్ని గుర్తించాలి. ఇప్పటి వరకు కేరళలో కాలుమోపలేని స్థితిలో ఉన్న భాజపా బలం క్రమంగా పుంజుకుంటుండడం విశేషం. నిజానికి రాష్ట్రంలో భాజపా పలుకుబడి 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి పెరగడం మొదలైంది. ఎట్లా అంటే 2011లో కేవలం 6 శాతంగా ఉన్న ఓట్ల భాగస్వామ్యం, 2014 నాటికి 10 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనం. దీనికితోడు కొద్ది నెలల క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో భాజపా పనితీరు బాగా మెరుగైంది కూడా! గతంలో రాష్ట్రంలోని వేర్వేరు కార్పొరేషన్లలో భాజపా కేవలం 9 సీట్లకు మాత్రమే పరిమితపై ఉండగా, గత ఎన్నికల్లో 51 స్థానాలకు పెరిగింది. వీటిల్లో పార్టీ అద్భుత పనితీరు కనబరచింది తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో! ఇక్కడ భాజపా మొత్తం 34 స్థానాలను గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఇక మొత్తం మున్సిపాలిటీల విషయానికొస్తే, అన్ని మున్సిపాలిటీల్లో 2010లో కేవలం 79 స్థానాల్లో గెలుపు సాధించగా, 2015 ఎన్నికల్లో వీటి సంఖ్య 236కు పెరిగింది!
ప్రస్తుతం యుడిఎఫ్‌పై, ఎల్‌డిఎఫ్ ఆధిపత్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, పెరుగుతున్న భాజపా పలుకుబడి ఎల్‌డిఎఫ్ అవకాశాలను తెబ్బతీసే పరిస్థితి నెలకొంది. అయితే భాజపా ప్రభావం ఎల్‌డిఎఫ్ కంటే, యుడిఎఫ్‌పైనే అధికంగా ఉండబోతున్నదన్నది నిర్వివాదాంశం. ముఖ్యంగా భాజపా పలుకుబడి పట్టణ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతోంది. వీటిల్లో పార్టీకి పోలైన ఓట్లు 13.7 శాతం, రాష్ట్రం మొత్తంమీద సాధించిన సగటు ఓట్లకంటే అధికం. ఇక ఎల్‌డిఎఫ్ రాష్ట్ర సగటు ఓట్ల శాతం 40.1 కాగా, అందులో పట్టణాల వాటా 36.5 శాతం! ఈవిధంగా పట్టణాల్లో తమ ఓట్లు భాజపాకు బదలాయింపు జరగడం ప్రస్తుతం ఎల్‌డిఎఫ్ ఆందోళనకు కారణమవుతోంది.
చూస్తుంటే పట్టణ యువత భాజపా వైపునకు ఆకర్షితులవుతున్నట్టు ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సిఎస్‌డిఎస్ నిర్వహించిన సర్వేలో..అగ్రవర్ణాల్లో 22 శాతం మంది భాజపాకు, 27 శాతం మంది ఎల్‌డిఎఫ్‌కు ఓటు చేసినట్టు తేలింది. మరో ముఖ్య అంశమేమంటే నాయర్ వర్గాల్లో వచ్చిన గణనీయమైన మార్పు. వీరిలో 30 శాతం మంది భాజపాకు, మరో 30 శాతం మంది ఎల్‌డిఎఫ్‌కు ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో నాయర్ సర్వీస్ సొసైటీ వారికి సంబంధించిన ఇతర సంస్థలను భాజపా దువ్వడం ప్రారంభించింది.
ఎన్ని చెప్పుకున్నా గతకాలపు కేరళ ఓటర్ల చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే.. అధికార మార్పిడి అనేది ప్రతిసారి చోటు చేసుకోలేదు, కొన్ని సార్లు అది తల్లక్రిందులైంది కూడా. అధికారంలో ఉన్న పార్టీకి వరుసగా కేరళలో మాదిరిగానే వరుస ఎన్నికల్లో ఒకే పార్టీకి అధికారాన్ని కట్టబెట్టకుండా ఉండే సంప్రదాయం పంజాబ్‌లో కూడా కనిపిస్తుంది. అయితే ఆశ్చర్యంగా 2007లో అకాలీదళ్-్భజపా సంకీర్ణ ప్రభుత్వానికే పంజాబ్ ప్రజలు మళ్లీ పట్టం కట్టారు. కేరళలో 2007 నాటి పంజాబ్ పరిస్థితే పునరావృత్తం అయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
‘‘శ్రీ నారాయణ ధర్మ పరిపాలన’’ అనే పేరుగల ఎజహవా, నాయర్ల సమాజానికి చెందిన సంస్థతో భాజపా జట్టుకట్టడం ప్రస్తుతం కేరళలో చోటు చేసుకున్న తాజా పరిణామం. ఇది ఎల్‌డిఎఫ్ అవకాశాలను బాగా దెబ్బతీస్తుందని అంచనా. కేరళలో ఎజహవాలు, నాయర్లు ప్రస్తుతం బలమైన వర్గాలు. కేరళ మొత్తం జనాభాలో ఎజహవాలు 23 శాతం, నాయర్లు 14 శాతం ఉన్నారు. ఈ రెండు హిందూ బ్లాక్‌లు ఇప్పటి వరకు ఒకేతాటిపై నడిచిన దాఖలాలు లేవు. అంతేకాదు ఎవరికి వారు తమకు అనుకూలమైన వారికే ఓటు వేస్తూ రావడం సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో భాజపా, ప్రధానమైన ఈ రెండు హిందూ సమాజాలను ఏకతాటిపైకి తీసుకొని రావడం ద్వారా హిందూ ఓటు బ్యాంకును చీలిపోకుండా యత్నిస్తోంది.
కేరళలో ఎజహవాల జనాభా సంఖ్య హెచ్చు. ఒకప్పుడు వీరు వామపక్షాలకు వెన్నుదన్నుగా నిలిచారు. మారిన పరిణామాల నేపథ్యలో బిడిజెఎస్-బిజెపి అలయన్స్‌కే వీరు ఓటు చేసే అవకాశాలు మెండు. అట్లాగని భాజపా కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ఎట్టిపరిస్థితుల్లో భావించడానికి వీల్లేదు. కాకపోతే భాజపా ఏర్పరచుకున్న కొత్త కూటమి తాజాగా యుడిఎఫ్ కంటే, ఎల్‌డిఎఫ్ అవకాశాలను మరింతగా దెబ్బతీయడం ఖాయం. దీనికితోడు ఎల్‌డిఎఫ్‌లో అంతర్గత కుమ్ములాటలు పార్టీ పరువును బజార్న పడేసే రీతిలో కొనసాగుతున్నాయి. బాహ్య శత్రువుకంటే అంతర్గత శత్రువు మరింత ప్రమాదకారి అన్నది తెలిసిందే. ప్రస్తుతం సంకీర్ణలోని అసమ్మతి వర్గాలు ఎల్‌డిఎఫ్‌ను ఎంతమేర దెబ్బతీయగలవనేది ఎన్నికల్లో మాత్రమే బయటపడగలదు. ఒకవైపు భాజపా, మరోవైపు అంతర్గత పోరు వెరసి ఎల్‌డిఎఫ్‌కు అగ్నిపరీక్షను పెడుతున్నాయి. మరి ఈ పరీక్షలనుంచి ఎల్‌డిఎఫ్ ఎంతమేర బయటపడుతుందనేది వేచి చూడాల్సిన అంశం.

- సంజయ్ కుమార్