కలర్స్ స్వాతి ప్రేమ వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెలివిజన్ తెరపై కలర్స్ ప్రోగ్రాంతో సందడి చేసిన కలర్స్ స్వాతి ఆ తరువాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది. గత కొంత కాలంగా వికాస్‌తో ప్రేమాయణం సాగిస్తున్న స్వాతి.. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకుంది. వికాస్ పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. హీరోయిన్‌గా తెలుగులో ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంది కానీ ఆమె ఆశలు నిరాశలయ్యాయి. మరోవైపు తెలుగు అమ్మాయిలకు కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టింది.. అక్కడ అదే పరిస్థితి. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. తాజాగా సినిమాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుంది. హీరోయిన్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్లేబ్యాక్ సింగర్‌గా ఇమేజ్ తెచ్చుకున్న స్వాతి మరి పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందా లేక హౌస్‌వైఫ్‌గా సెటిల్ అవుతుందా అన్నది చూడాలి.