హర్రర్ థ్రిల్లర్ ‘ది నన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసినటువంటి ‘కంజ్యూరింగ్’ యూనివర్స్ సిరీస్‌కు కొనసాగింపుగా న్యూలైన్ సినిమా నుండి హర్రర్ థ్రిల్లర్‌గా వస్తున్న ‘ది నన్’ సినిమా హర్రర్‌లో మరో చీకటి కోణాన్ని ఆవిష్కరించనున్నది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ద్వారా ఈనెల 7న ఇంగ్లీషు, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది. హార్డి దర్శకత్వం వహించిన ‘ది హాలో’ సినిమా చూసిన తరువాత జేమ్స్‌వాన్ మరియు సఫ్రాన్‌లు తమ ఒరవడిలోకి ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా హార్డి మాట్లాడుతూ.. వారి నుండి ఫోన్‌కాల్ రావడం అనేది నా కల నిజమైనట్లుగా అనిపించింది. ఈ సందర్భంగా నా శక్తివంచన లేకుండా ప్రయత్నించాల్సి ఉంటుందని నాకు తెలుసు. అదే విధంగా ‘కంజ్యూరింగ్’ యూనివర్స్ సిరీస్‌కు నూతన చిత్ర నిర్మాణాన్ని చేపట్టడం పట్ల నాకు చాలా సంతోషం కలిగించింది . స్క్రిప్ట్ చాలా అసాధారణమైనది. రచయిత గ్యారీ చాలా ప్రతిభావంతుడు. అతడు ఈ కళలో బాగా ఆరితేరాడు, నాలాగా, ఆయనకు కూడా హర్రర్ అంటే చాలా ఇష్టం. ఆయన అభిరుచే అందుకు నిదర్శనం. గొప్ప ఐడియాలతో, భయానక సంఘటనలను ఎదుర్కొనే ఆసక్తికరమైన పాత్రలతో ఆయన కథను సమతూకం చేయడం జరిగింది. ప్రారంభంనుండే కథ కట్టిపడేసి చివరి వరకు మిమ్మల్ని ఉత్కంఠకు గురిచేస్తుంది అన్నారు.