క్రైమ్/లీగల్

మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి సామాజికవేత్త చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 4: అనంతరం రూరల్ మండలం పూలకుంట గ్రామానికి చెందిన గోపీనాథ్ ఐఐటీలో చదువుతూ అనారోగ్య కారణంతో మృతి చెందాడు. ఐఐటిలో మంచి ర్యాంకు సాధించి భవిష్యత్తులో బాగా చదవాలనే ఉన్న గోపీనాథ్‌కు బ్రెయిన్ ట్యూమర్ రావడంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం సరైన చికిత్స అందించలేకపోవడంతో మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి విషయాన్ని తెలుసుకున్న జనసేన నాయకులు ఎండి నాగభూషణ, జీవీ రమణల ద్వారా విషయాన్ని తెలుసుకున్న సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన మానవతా దృక్పథంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఉమాదేవి, పక్కీరప్పలకు రూ.10వేలుతోపాటు, చిన్నకుమారుడు చదువుకునేందుకు అయ్యే ఖర్చును భరించనున్నట్లు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ ఐఐటీ ర్యాంకర్‌గా సీటును సంపాదించుకుని మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థి మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటని తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య
రొళ్ల, సెప్టెంబర్ 4 : మండల పరిధిలోని హెచ్‌టీ హళ్లికి చెందిన శ్రీరంగప్ప(32) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మస్తాన్ తెలిపారు. పెళ్లీడుకొచ్చిన తనకు కుటుంబ సభ్యులు సహకరించడం లేదని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తల్లి పుట్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గాయపడిన బీ.్ఫర్మసీ విద్యార్థి మృతి
బత్తలపల్లి, సెప్టెంబర్ 4: బత్తలపల్లిలో ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో గాయపడిన బి ఫార్మసి విద్యార్థి రాజేష్ (22) సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్‌ఐ హరున్‌బాషా తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన రాజేష్ అనంతపురం సమీపాన ఇటుకలపల్లి వద్ద గల రైపర్ బి ఫార్మసి కళాశాలలో రెండవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిలో శిక్షణ నిమిత్తం రైపర్ కాలేజి విద్యార్థులతో కలసి బత్తలపల్లి వచ్చారు. శిక్షణ అనంతరం విద్యార్థులతో కలసి కళాశాలకు వెళ్లడానికి బత్తలపల్లి కూడలిలో కదిలే ఆర్టీసీ బస్సును ఎక్కుతుండగా నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సును విద్యార్థి ఢీకొనడంతో కిందపడ్డాడు. వెంటనే ఆర్డీటీ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తండ్రి ప్రసాద్‌కు అప్పగించారు. బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.