సబ్ ఫీచర్

అవసరాలే ఉపాధి మార్గాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుంటే మార్గం అదే కనబడుతుంది. ఇది పాతపాటే. కాదనను. కానీ నా జీవితంలో మంచి మార్పు తెచ్చింది. ఎలానో చెబుతాను వినండి. మాది మధ్యతరగతి కుటుంబం. నాకిద్దరు పిల్లలు.వారిని మేమిద్దరం కష్టపడి పెంచుకుంటున్నాం. ఇటు ఇల్లు నడిపివ్వడం, అటు పిల్లలను చదివించడం మాకు చాలా కష్టంగా ఉండేది. అపుడే నేను స్వయం ఉపాధిరంగాన్ని చూసాను. కాకపోతే అందులో ఎంతో కొంత పెట్టుబడి ఉండాలి. ఏకాస్త అయినా కూడబెడుదామంటే అది కాని పని అని నాకు రెండునెలల్లోనే తెలసిపోయింది. పోనీ ఎక్కడైనా కొలువులో చేరుదామంటే నాకు చదువు అంతగారాదు. చదువుఅక్కర్లేని కొలువులకోసం చూశాను. అక్కడంతా శ్రమదోపిడి. ఏడు లేక ఎనిమిది గంటలు పనిచేయాలి. సెలవు ఉండదు. వారు చెప్పిన టైముకు వెళ్లలేకపోతే ఆ ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందే.
నా స్నేహితురాలు అన్నీ నీకనుకూలంగా ఉంటాయా? దేనినైనా చేసుకొంటూ పోతే బాగుంటుంది అని సలహా ఇచ్చింది. అదీ నిజమే అనిపించింది.
ఒకరోజు బాగా ఆలోచించా. కాస్త సినిమా ప్రభావం నాలో ఉందనుకోండి. ఎప్పుడో పాతసినిమా గుర్తు వచ్చింది.
ఎక్కడ ఏది దొరకదో దాన్ని నీవు వ్యాపార వస్తువుగా మార్చుకుంటే అద్భుతాలను సృష్టించగలవు అనేది ఆ సినిమా సందేశం.
ఆ సందేశానే్న నేను ఆలోచించి ఆచరణలో పెడదాం అనుకొన్నాను.
చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకొనేవారు ఎక్కువ.. వారికి ఏదైనా సాయం చేస్తున్నట్టుగా ఉండే ఉపాధిని ఎన్నుకుంటే ఎట్లా ఉంటుంది అనుకొన్నా. అంతేనండీ నాకు వ్యాపారం మొదలైంది. ముందు నేను నాలుగు అపార్ట్‌మెంట్స్ తిరిగాను. ఎవరెవరు భార్యాభర్తలు ఉద్యోగస్థులుగా ఉన్నారో తెలుసుకొన్నాను. వారి లిస్టు తయారు చేసుకొన్నాను. వారింటికి వెళ్లాను.
రాత్రిపూట వారికి కావల్సిన ఆహారాన్ని అంటే చపాతీలు, పుల్కాలు, ఇడ్లీల్లాంటి ఉపాహారాలు నేను అందచేస్తాను. మీ ఇంటికి నేను అందిస్తాను అని చెప్పాను. కొంతమంది ఎందుకండీ ఇపుడు ఒక కాల్ చేస్తే ఫలానా హోటల్‌నుంచి కావాలి అంటే నిముషాల్లో తెచ్చి ఇస్తున్నారు కదా అనేశారు.
వారికి నే సమాధానం చెప్పాను. ఎంతైనా హోటల్ హోటలే కదా. నేను మీరు స్వయంగా ఇంట్లో వండినట్టే వండుతాను. స్వగృహ అన్నమాట అన్నారు నన్ను. నిజమే స్వగృహనే ఇంట్లో మీకు కావల్సినంతమేరకు చేసి ఇస్తాను. దానికి మీరు నాకింత అని ఇవ్వండి అని చెప్పాను.
అంతే ఒకరితో ప్రారంభమైన నా బిజినెస్ ఇపుడు పది అపార్ట్‌మెంట్లకు వ్యాపించింది. అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారంతా కొనుగోలు చేయరనుకోండి. కానీ అందులో కొంతమంది ఉద్యోగినులు చేస్తారు. వారే నా కష్టమర్లు అనుకొన్నాను. కానీ రైటైర్ లైఫ్‌లో ఉన్నవారు కూడా నా పుల్కాలు, చపాతీలు కావాలని కోరుకుంటున్నారు.
మొట్టమొదట నేను ఒక్కదానే్న వందరూపాయాలతో మొదలుపెట్టిన నా బిజినెస్ ఇపుడు ముగ్గురు పనివారితోను, 10వేలరూపాయల పెట్టుబడితో సాగుతోంది.
అందుకే కాదేదీ కవితకనర్హం అన్నట్టు బిజినెస్ కళ్లతో చూస్తే చాలు అన్నీ వాణిజ్యమార్గాలు కనిపిస్తాయి.

- మాధురి