సిల్లీఫెలోస్ వస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్, సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సిల్లీఫెలోస్’. పూర్ణ, నందిని రాయ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. బ్లూప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎల్‌ఎల్‌పి మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై కిరణ్‌రెడ్డి మరియు భారత్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈనెల 7న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోంది. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ- ఈ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. భీమనేని శ్రీనివాసరావుతో నా అనుబంధం 26 ఏళ్ళు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనలో ఎలాంటి మార్పు లేదు. సినిమా ఎంత బాగా వచ్చిందో సినిమా ట్రైలర్, ప్రమోషన్ సాంగ్స్ చూస్తే తెలుస్తుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అనిపిస్తుంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ- అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. నా గురువు.. అల్లరి రవిబాబుకి టీచర్స్ డే శుభాకాంక్షలు. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అందరికీ టీచర్స్‌డే శుభాకాంక్షలు. భీమనేని నాకు పెద్దన్నయ్యలాగా.. నా అన్ని సినిమాల్లో ఆయన కృషి తప్పక కనిపిస్తుంది. సుడిగాడు తర్వాత మా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో సునీల్ రావడం సినిమాకి ప్లస్. నేను ఆయనతో చేసిన ఫస్ట్ సినిమాలో ఎలా ఉన్నారో ఇపుడు అలానే ఉన్నారు. ఎక్కడా ఇగోస్ లేకుండా సినిమా కోసం చాలా కష్టపడి సినిమా చేశాం. పాత సునీల్ సినిమాలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అన్నారు. సునీల్ మాట్లాడుతూ- భీమనేనితో పనిచేయం చాలా ఆనందంగా ఉంది. నాకు చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలవల్ల ఆయనతో పనిచేయడం చాలా ఈజీ అయ్యింది. నరేష్‌తో సినిమా చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది అన్నారు.